Snake Viral Video: మీ ముందుకి పైనుంచి పాము ఎగిరొచ్చి పడితే ఎలా ఉంటుందో ఊహించగలరా

ఈ వీడియోలో ఓ పాము ఇంటి పైకప్పు నుంచి ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై జంప్ చేస్తుంది. సెకన్ల వ్యవధిలో అత్యంత వేగంగా రోడ్డు దాటేస్తుంది. చూస్తున్నవారంతా నిశ్చేష్టులై ఉండిపోవల్సిందే. 

సోషల్ మీడియాలో తరచూ పాములు, జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలైతే ఇంకా ఆకట్టుకుంటాయి. భయం కల్గించేవి కావడంతో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కూడా అలాంటిదే. రోడ్డుపై ఉన్నట్టుండి మీ ముందు..పక్కనున్న ఇంటి పైకప్పు నుంచి ఓ ప్రమాదకరమై పాము ఎగిరొచ్చి పడితే ఎలా ఉంటుంది..ఊహకే భయమేస్తుంది కదూ..నిజంగా అదే జరిగింది. అందుకే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

పాములకు సంబంధించిన చాలా వీడియోలు ఇలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిలో పాములతో ఆటలాడేవి ఉంటే..మరి కొన్ని పాముల ప్రమాదకర రూపం భయపెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడున్న వీడియో వీటన్నింటికీ భిన్నమైంది. ఏదో కోతులు జంప్ చేసినట్టు ఒక్కసారిగా పై నుంచి రోడ్డుపైకి జంప్ చేస్తుంది ఈ వీడియోలో ఓ ప్రమాదకరమైన పాము. పాములు ఇలా జంప్ చేయడం గతంలో చూసుండరు. 

ఒక్క ఉదుటున ఎగిరి జంప్ 

సాధారణంగా కోతులే అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు జంప్ చేస్తుంటాయి. కానీ ఇలాంటిది మరెక్కడా చూసుండరు. పాములు అంత దూరం అంత పైనుంచి జంప్ చేయడం. పాములు సాధారణంగా ఎటాక్ చేసేందుకు కొద్దిగా అక్కడికక్కడే ఎగురుతుంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ ఇంటి పైకప్పు నుంచి పాము ఎగిరి జంప్ చేయడం స్పష్టంగా చూడవచ్చు. ముందు ఆ ఇంటి పైకప్పులో చివరి వరకూ వస్తుంది. ఆ తరువాత తన శరీరాన్ని బయటకు పూర్తిగా స్ట్రెచ్ చేస్తుంది. అంతే చూస్తుండగానే..ఒక్క ఉదుటున అంత పైనుంచి నేరుగా రోడ్డుపైకి జంప్ చేసేస్తుంది.

ఎప్పుడైతే పాము రోడ్డుపై జంప్ చేస్తుందో..అంతే వేగంగా రోడ్డు దాటి పక్కనున్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోతుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌పై షేర్ చేశారు. కొన్ని సెకన్లలోనే ఈ వీడియో 9 లక్షల వ్యూస్ దాటేసింది.

Also read: Arrest Pigs: ఊర పందులను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు కమిషనర్ లేఖ.. పందులు చేసిన నేరం ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *