Today Panchangam 06 February 2023 నేడు సోమవారం, పాడ్యమి తిథి నాడు శుభ, అశుభ ముహుర్తాలెప్పుడో చూడండి…

today telugu panchangam హిందూ, వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని పక్కాగా చూస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తుంది. పంచాగం లెక్కించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ సూర్యమానం, చాంద్ర మానం విధానాలనే అనుసరిస్తున్నారు. సూర్యుడి సంచారంతో అనుసంధానమైనది సూర్యమాన పంచాంగం, అదే విధంగా చంద్రుని సంచారంతో అనుసంధానమైనది చంద్రుని పంచాంగం. మన తెలుగువారు ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. అందుకే చాంద్రమానం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఛైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. ఈ సందర్భంగా నేటి 06 ఫిబ్రవరి(February) సోమవారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాష్ట్రీయ మితి మాఘం 17, శాఖ సంవత్సరం 1944, మాఘ మాసం, క్రిష్ణ పక్షం, పాడ్యమి తిథి, సోమవారం విక్రమ సంవత్సరం 2079. రజబ్ 14, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 06 ఫిబ్రవరి 2023

సూర్యుడు ఉత్తరాయణం, శిశిర బుుతువు, రాహుకాలం ఉదయం 8:15 గంటల నుంచి 9:40 గంటల వరకు. ఈరోజు పాడ్యమి తిథి తెల్లవారుజామున 2:19 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 3:03 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశి, సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు.

Mahashivratri 2023 శివయ్య కలలో ఇలా కనిపిస్తే శత్రువుల పీడ తొలగిపోతుందట…!

సూర్యోదయం సమయం 06 ఫిబ్రవరి 2023

: ఉదయం 6:50 గంటలకు

సూర్యాస్తమయం సమయం 06 ఫిబ్రవరి 2023

: సాయంత్రం 6:09 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం :

ఉదయం 5:14 గంటల నుంచి ఉదయం 6:02 గంటల వరకు

అభిజీత్ ముహుర్తం

: మధ్యాహ్నం 12:07 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు

నిశిత కాలం

: అర్ధరాత్రి 12:10 గంటల నుండి మరుసటి రోజు 1:02 గంటల వరకు

సంధ్యా సమయం

: సాయంత్రం 6:14 గంటల నుండి సాయంత్రం 6:26 గంటల వరకు

అమృత కాలం

: మధ్యాహ్నం 1:16 గంటల నుంచి మధ్యాహ్నం 3:03 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం

: ఉదయం 8:15 గంటల నుంచి ఉదయం 9:40 గంటల వరకు

గులిక్ కాలం

: మధ్యాహ్నం 1:55 గంటల నుంచి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

యమగండం

: ఉదయం 11:05 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

దుర్ముహర్తం

: మధ్యాహ్నం 12:52 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:08 గంటల నుండి సాయంత్రం 3:53 గంటల వరకు

– ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read

Latest Religion News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *