Telangana Govt Gives 3 lakh financial assistance to build house in own land: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2023-24ను శాసనసభలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈరోజు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసింది. విద్య, వైద్యానికి ఎప్పటిలాగా ప్రధాన్యతను ఇచ్చింది.
బడ్జెట్ 2023-24 సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సామాన్యులకు శుభవార్త చెప్పారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.7,890 కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీశ్ వెల్లడించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తారు. సీఎం కోటాలో 25 వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. మొత్తంగా 2 లక్షల 63 వేల మందికి 7890 కోట్లు అందనున్నాయి. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.12వేల కోట్లు కేటాయించారు.
బడ్జెట్ 2023-24లో వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసింది. విద్య, వైద్యానికి ప్రధాన్యతనిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు పథకాలకు కూడా భారీగా నిధులు కేటాయించింది. పల్లెప్రగతి, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించింది. నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు, విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు, వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు, ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు, రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు, రైతుబందు పథకానికి రూ. 15,075 కోట్లు, రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
Also Read: Upcoming Cars 2023: భారత మార్కెట్లోకి రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు.. హ్యుందాయ్ క్రెటాకు మొదలు కానున్న కష్టాలు!
Also Read: Hero Xoom 110 Scooter 2023: హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.