Veda Release: ఫిబ్రవరి 9న థియేటర్లలో.. 10న ఓటీటీలో..వేద, ఇదేంటి?

Veda Pre Release Event: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో వేద పేరుతోనే డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ కెరీర్‌లో 125వ సినిమా తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్‌, మోషన్ పోస్టర్ ఇలా అన్నీ సినిమా మీద బజ్‌ను పెంచగా కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ  యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించగా ఈ సినిమాలో ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది నటించారు. . ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఫిబ్ర‌వ‌రి 7న జ‌ర‌గ‌గా నంద‌మూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 9న విడుదలవుతుండగా, కన్నడ వెర్షన్ గతేడాది డిసెంబర్ 22న విడుదలైంది. కానీ ఇక్కడ గందరగోళం ఏమిటంటే, ఈ సినిమా కన్నడ వెర్షన్ డిసెంబర్ 10న రిలీజ్ అవుతోంది.

ఒరిజినల్ థియేట్రికల్ విడుదల నుండి ఇప్పటికే 50 రోజులు ఉన్నందున ఓటీటీ విడుదలను ఆపడం మేకర్స్‌కు అనివార్యమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే శివ రాజ్‌కుమార్ తదుపరి చిత్రం, పాన్-ఇండియా సినిమాగా చెబుతున్న ది ఘోస్ట్ కోసం ఇది కసరత్తు అనిపిస్తుందని అంటున్నారు.

ఇతర భాషలకు చెందిన స్టార్ నటులందరూ తెలుగు రాష్ట్రాల్లో తమ స్టార్ డం చాటుకోవాలి అని అనుకుంటున్న క్రమంలో కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ కూడా ఇక్కడ తన మార్కెట్‌ను నిర్మించుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. శివ రాజ్‌కుమార్ నటించిన వేద తెలుగు థియేట్రికల్ విడుదల ఉండడం దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది.  

Also Read: Lata Mangeshkar Death anniversary: ఆరోజుల్లోనే ‘లతా’ను చంపడానికి పాయిజన్ ఇచ్చారు.. ఏమైందో తెలుసా?

Also Read: Vani Jayaram Death Reason: వాణి జయరాం మృతికి అదే కారణం.. ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *