రిపోర్టర్ :పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ : విజయవాడ
ఉల్లిపాయ ఇది లేనిదే ఏ కూర వండరు, వండిన కూర రుచి కూడా ఉండదు అంటే ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. అలాంటిది ఉల్లి పంట వేసిన రైతులకు లాభాలు రాకపోగా నష్టాలు మిగిలాయి. ప్రకృతి కన్నెర్ర చేసిన సందర్భాల్లో వర్షాలు కారణంగా చేతికి వచ్చిన పంట నష్టపోయి రైతులు లభో దిబోమన్నారు.
కృష్ణా జిల్లాలోనికొత్తూరు తాడేపల్లిలో మాణిక్యల రావు అనే రైతు పండించిన పంటకు తానే ధరను నిర్ణయించే హక్కు లేక పంటను నిల్వ చేయడానికి వీలు లేకపోయింది. దళారి చెప్పిన రేటుకు పంటను అమ్మలేకపోతున్నాడు. పండించిన పంటను పొలం పక్కనే పెట్టుకుని అమ్ముకుంటున్నారు. అలా అమ్మినప్పటికి ఈ రైతుకికనీస పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్నారు. పైగా నష్టమే మిగిలడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
పెట్టిన పెట్టుబడి రాక, కనీసం కూలీకూడా చెల్లుబాటు అవ్వక అంత నష్టం చేకూరడంతో తనలాంటి రైతులందరులబోదిబోమంటున్నారు. అవన్నీ దాటుకుని రైతుకి…చేతికి అందిన పంటను అమ్మడానికి చూస్తుంటే మధ్యలో దళారులు మోసం చేస్తున్నారు.తానుపండించిన పంటకుధరను నిర్ణయించే హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు..మాణిక్యల రావు.
తన నాలుగు ఎకరాల పొలంలోపస్తులు ఉండి, అప్పు తెచ్చి చమటోర్చి పంట పండిస్తుంటే చేతికి వచ్చిన పంటను అమ్మడా నికి దళారులు ఇష్టానుసారంగా ధరను నిరయిస్తున్నారని ఏడుస్తున్నాడు..రైతు దళారి చెప్పిన ధర నచ్చక పంటను నిల్వ ఉంచడానికి కుదరదా, ఒకవేళ నిల్వ ఉంచుదామని ప్రయత్నం చేసినా అక్కడ ఇష్టాను సారంగా నిల్వ చేసినందుకు అధిక ధర విధిస్తున్నానారని చెబుతున్నారు.
ఒకప్పుడు కేజీ ఉల్లి సెంచరీలు దాటి, ప్రభుత్వ ని జనాలు దూషించిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా లేక రైతులు లబోదిబోమంటున్నారు. దళారి ఉల్లిని కేజీ 7 రూపాయలుకు తీసుకుని బయట 25 రూపాయలు వరకు అమ్ముకుంటున్నారు. రైతు తాను పండించిన పంటకు ధరను చెప్పే హక్కు లేకుండా పోయింది. దళారి చెప్పిన ధరకు పంటను అమ్మాలి అలా వారు చెప్పిన ధరకు అమ్మలేక ఆ పంట నేల పాలు అవుతుంది.