రిపోర్టర్ :పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ : విజయవాడ
ఇప్పుడు ఉన్న ఈ లోకంలో మనం బతుకుతున్న సమాజంలో బంధుత్వాలు, అనుబంధాలు ఏమి లేవు ప్రేమ, ఆప్యాయతలు అసలే లేవు. ఏదైనా డబ్బుతోనే ముడి పడి ఉంది. డబ్బు ఉంటే ఎక్కడ లేని ప్రేమను పంచుతూ ఉంటారు. అదే డబ్బే లేకుంటే ప్రేమ లేదు బంధుత్వం లేదు అలా ఐపోయింది నేటి సమాజం తీరు.
కని పెంచిన తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దవారు అయ్యాక వారు తల్లిదండ్రులుని చూడటం మానేశారు. చూడక పొగ తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తున్నారు. మరి కొందరు ఆస్తి కోసం చంపడానికి కూడా వెనుకాడటం లేదు , కొందరిని అయితేవృద్ధాశ్రమంలో చేర్చి వారి కన్నీటికి కారణం అవుతున్నారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్ర గ్రామంలో చోటు చేసుకుంది.
విచిత్రం ఏమిటంటే తండ్రి ఆస్తి పాస్తులు పంచిన కూడా ఇంకా కావలని సతాయిస్తూన్నదే కాకుండా తండ్రి చనిపోయిన కూడా డబ్బు ఇస్తేనే అంతక్రియలకు వస్తానని ఖరాకండిగా చెప్పాడు ప్రబుద్ధుడు. ఇక చేసేదేమీ లేక కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేసింది.
స్థానికుల వివరాల మేరకు… అనిగండ్లపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి కోటయ్య (80) అతడికి ఉన్న భూమిని అమ్మగా కోటి రూపాయలు రావడంతో దానిలో 70% తన కుమారుడికి ఇచ్చి మిగిలిన 30% అతడి దగ్గరే ఉంచుకున్నాడు. ఆ డబ్బు విషయంలో కూడా రోజు గొడవలు పడుతుండటంతో భరించలేక కోటయ్య దంపతులు గత ఆరు సంవత్సరాలుగా గుమ్మడిదుర్రు లోని కూతురు దగ్గరే ఉంటున్నారు.
అనారోగ్యతం కోటయ్య శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కొడుకుకి చెప్పగా మిగిలిన డబ్బులు ఇస్తేనే తలకొరివి పెట్టి, కర్మకాండలు చేస్తానని చెప్పాడు. డబ్బులేదంటే ఆఖరి చూపు కూడా చూడను అనడంతో చేసేదేమీ లేక కూతురేతలకొరివి పెట్టి , కర్మకాండలు చేసింది.