అడవి మార్గంలో శ్రీశైలానికి ఇలా చేరుకోవచ్చు..!

Murali Krishna, News18, Kurnool

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటిది శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగునున్న నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్వకూడదనే నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగునున్న నేపథ్యంలో కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం (Srisailam) క్షేత్రానికి చేరుకుంటారు. భక్తుల రద్దీనిదృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాటులను పూర్తి చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ భద్రత ఏర్పాట్లను ఆలయ ఈవో లవన్న ఆధ్వర్యంలో జరుగుతుండగా వీటిని నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామ్యూన్ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. స్వామి వారిని స్పర్శ దర్శనం చేసుకునేందుకువచ్చే శివమాల ధరించినటువంటి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.అదేవిధంగా కాలినడకన శ్రీశైలం క్షేత్రానికి చేరుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నల్లమల్ల అడవి ప్రాంతంలో ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నడక మార్గంలో అడవిలో వచ్చే భక్తులు ఎక్కడ ఎలాంటి చలి మంటలు వంటివి పెట్టరాదని హెచ్చరించారు.

ఇది చదవండి: ఉగ్ర నరసింహమూర్తికి సముద్ర స్నానం.. ఈ సాంప్రదాయం ఎక్కడంటే..!

అడవి మార్గంలో శ్రీశైలం చేరుకోవడానికి ప్రత్యేక మార్గాలు

ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదగా 7 కిలోమీటర్లు రోడ్డు మార్గాన వెంకటాపురం చేరుకొని అక్కడినుంచి అడవిమార్గంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి. గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి గుడికి చేరుకోవచ్చు. మందిరం ఆవరణలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి సదుపాయం కల్పించారు. మళ్లీ అక్కడి నుంచి మొదలై 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగులూటి వీరభద్ర స్వామి మందిరానికి చేరుకోవచ్చు.

ఆ ప్రాంతంలో దాతల సహాయంతో మంచినీళ్లు, అల్పాహారం కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మెట్ల మార్గము 8 కిలోమీటర్ల దూరం అడవి మార్గంలో ప్రయాణించిన తరువాత దామర్లకుంట చేరుకోవచ్చు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పెద్ద చెరువు 6 కిలోమీటర్ల కొండ మార్గంలో మఠం బావి, 3 కిలోమీటర్ల దూరంలో భీముని కొలను, అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కైలాస ద్వారము, అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం క్షేత్రానికి చేరుకోవచ్చు. వెంకటాపురం నుంచి అడవి మార్గంలో శ్రీశైలం క్షేత్రానికి సుమారుగా 47 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *