అదానీ షేర్లు కొనేందుకు ఇదే సరైన సమయమా? మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?

Adani Share: అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక బయటకు వచ్చిన క్రమంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 10 రోజుల వ్యవధిలోనే లక్షల కోట్లు నష్టపోయాయి. అదాని వ్యక్తిగత సంపద 60 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే, ఇవాళ్టి మంగళవారం ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ సంస్థల్లోని కొన్నింటి షేర్లు భారీగా పెరిగాయి. ఆరంభ ట్రేడింగ్‌లో 20 శాతం మేర పెరిగాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ విల్‌మార్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, ఎసీసీ సిమెంట్, అంబుజ సిమెంట్ వంటి షేర్లలో మంచి వృద్ధి కనిపించింది. కొద్ది రోజులుగా భారీగా అమ్మకాలకు గురైన అదానీ గ్రూప్ షేర్లు ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఈ పరిస్థితిలో అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయా? అనే ప్రశ్నలు చాలా మంది ఇన్వెస్టర్ల మదిలో మెదులుతుంటాయి. ఈ విషయంపై మార్కెట్ నిపుణులు పలు విషయాలను వెల్లడించారు. వాల్యూవేషన్ గురూ అశ్వత్ దామోదరన్ పలు వివరాలను తెలిపారు. ఇప్పటికీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ల ధరలు తక్కువగా ఏమీ లేవని గుర్తు చేశారు. ఒక వేళ హిండెన్‌బర్గ్ నివేదిక తప్పు అని తేలితే ఏం జరుగుతుందనే వివరించారు. ప్రస్తుతం అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర ఇవాళ ఒక్కరోజే రూ.200లకుపైగా పెరిగి రూ.1813 వద్ద ఉంది. ఇది తక్కువేమి కాదు.

97645063

నిపుణుల మాటేంటి?

ఫైనాన్స్ ప్రొఫెసర్ అశ్వత్ దామోదరన్ ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో అదానీ కంపెనీల రెవెన్యూ 30 శాతం పెరుగుతుంది. ఆ తర్వాత 5.59 శాతంతో వృద్ధి సాధిస్తుంది. 10 ఏళ్ల తర్వాత కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 3.6 శాతం నుంచి 7 శాతానికి చేరుకుంటుంది. దమోదరన్ తన బ్లాగ్‌లో రాసుకున్నట్లుగా క్యాష్ ఫ్లో, గ్రోత్, రిస్క్ వంటి ఫండమెంట్స్ చూసుకుకోవాలి. ప్రస్తుతం అదాని ఎంటర్ ప్రైజెస్ షేరు ధర రూ.1813 వద్ద ఉంది. అంటే.. తక్కువేమీ కాదు. కొద్ది రోజుల క్రితం ఈ షేరు ప్రతిరోజు పడిపోతూ వచ్చింది. ఫ్యామిలీ గ్రూప్ కంపెనీలు రాజకీయ కనెక్షన్లు కలిగి ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుందని దామోదరన్ తెలిపారు. ఫ్యామిలీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టేంత అత్యాశ తనకు లేదన్నారు.

అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ గరిష్ఠ స్థాయి రూ.4,190 నుంచి 62 శాతం మేర పడిపోయింది. ఫిబ్రవరి 3న లోయర్ సర్క్యూట్ తాకింది. ఒక సమయంలో వెయ్యి మార్క్‌కు పడిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ వేగంగా పుంజుకుంది. ఒక టైంలో గరిష్ఠ స్థాయి రూ.1965ను తాకి మళ్లీ వెనక్కి వచ్చింది. మంగళవారం ఉదయం నుంచే ఈ స్టాక్ మంచి బూమ్ లో కొనసాగింది. మరోవైపు.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ రూ.598.45 స్థాయిని తాకింది. అయితే, అదానీ పవర్ షేరు నష్టాల్లోనే కొనసాగింది. కానీ, అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు సైతం మంచి వృద్ధిని సాధించింది. రూ.1,295.85 స్థాయిని తాకింది.

97686383

Read Latest

Business News and Telugu News

Also Read:

Google Engineer: కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన గూగుల్ ఇంజినీర్.. ఇంతలో ఆమెకు మెసేజ్.. తెరిచి చూస్తే!

EMI మరింత భారం.. వడ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్.. నేటి నుంచే అమలు..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *