అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి.. గన్ మిస్‌ఫైర్ వల్ల కాదు.. తోటి తెలుగు విద్యార్థే..!

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. మొన్నీమధ్యే.. చికాగోలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువకముందే.. అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్ సాయి మహంకాళి (25) మృతిచెందాడు. అయితే.. ఈ ఘటనలో.. ముందుగా గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోయినట్టు సమాచారం వచ్చినా.. ప్రస్తుతం కేసు మరో మలుపు తీసుకుంది. గన్ మిస్ ఫైర్ కాలేదని.. తన తోటి విద్యార్థే కాల్చాడంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ విద్యార్థి కూడా తెలుగు విద్యార్థే కావటం గమనార్హం. ప్రస్తుతానికి అనుమానితుడైన రవితేజ గోలి (23) ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ రవితేజ గోలి కూడా అఖిల్ సాయి ఉంటున్న ప్రదేశంలోనే ఉంటూ ఉన్నత చదువు అభ్యసిస్తున్నట్టు సమాచారం.

అయితే.. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌ సాయి అనే విద్యార్థి 13 నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. కాగా.. ఎంఎస్ చదువుతూనే తన సొంత ఖర్చుల కోసం అఖిల్ సాయి.. అతను ఉంటున్న ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్న ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు. అయితే.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయ్యి.. బుల్లెట్ తగిలిందని.. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు.

97523028

కానీ.. ఈ ఘటనలో ట్విస్ట్ నెలకొంది. అఖిల్‌ సాయి గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోలేదని.. తోటి తెలుగు విద్యార్థి కావాలని కాల్చటం వల్లే చనిపోయాడని అక్కడి పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు.. అఖిల్‌ సాయి మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. చేతికి అందొచ్చిన కొడుకు దేశం కాని దేశంలో ప్రాణాలు వదలటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

97656966

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *