‘ఆంధ్ర’ పేరు మార్మోగిస్తున్నందుకు.. సీఎంకు నా ప్రత్యేక శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ ఆరోపించారు.. ఓ కార్టూన్‌తో ట్వీట్ చేశారు. ‘అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు.. ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు .. ఈలాగే కొనసాగించండి. మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రాష్ట్ర సంపద & ప్రగతి ‘కుక్కల’కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద & ఆస్తులు మాత్రం కాదు. That’s the spirit CM’అంటూ ఎద్దేవా చేశారు.

కార్టూన్‌లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అప్పు రత్నగా అవార్డు దక్కిందని సెటైర్లు పేల్చారు. భారత రత్నలాగా ఇది కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 9 నెలల్లో రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు ఆరోపించారు. ఈ ట్వీట్‌పై జనసైనికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని జనసేన కేడర్ అంటుంటే.. అప్పుల విషయంలో అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఇస్తోంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *