ఆస్ట్రేలియా (Australia)తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli).. తన కొత్త ఫోన్ పోయిందంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. దాంతో అభిమానులు షాక్‌కి గురై కోహ్లీని ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జొమాటో (Zomato) ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అప్పుడు అసలు విషయం అర్థం చేసుకున్న నెటిజన్లు ఫన్నీగా విరాట్ కోహ్లీపై జోక్‌లు వేస్తున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం ఉదయం 9:30 గంటలకి ఫస్ట్ టెస్టు మ్యాచ్ (India vs Australia 1st Test ) ప్రారంభంకానుంది. ఇప్పటికే భారత్ జట్టుతో కలిసి అక్కడికి చేరుకున్న విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2019, నవంబరులో చివరిగా టెస్టుల్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఈ ఐదు రోజుల ఫార్మాట్‌లో ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా 100 పరుగుల మార్క్‌ని అందుకోలేదు. దాంతో ఈ సిరీస్‌లో ఆ శతకాల కరవుని కోహ్లీ తీర్చేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సిరీస్ ముంగిట విరాట్ కోహ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే? ‘‘కొత్త ఫోన్‌ని కనీసం అన్‌బాక్స్ చేయకుండానే పోగొట్టుకోవడం అంత బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్‌ని చూశారా? ’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్లు కోహ్లీ ఫోన్ గురించి చర్చిస్తుండగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జొమాటో ‘బాబీ ఫోన్ నుంచి ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఏమాత్రం సందేహించొద్దు. అది కచ్చితంగా నీకు సాయపడుతుంది’ అని రిప్లై ఇచ్చింది. విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆ ఫోన్‌ని కొనుగోలు చేయగా.. ఆ ఫోన్‌ని కనీసం ఓపెన్ చేయకుండానే వాళ్లు తీసుకెళ్లిపోయినట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరి ఆ గిప్ట్ ఎవరికి అనేది మాత్రం తెలియడం లేదు.