ఇలా తినేవాళ్లను ఫంక్షన్లకు పిలవకండి.. ఐఏఎస్ ట్వీట్ వైరల్ దేశంలో కోట్ల మంది ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆహారం కోసం అలమటిస్తున్నారు. కాని ఇదంతా ఒకవైపైతే .. మరోవైపు కొందరు వేడుకలు, పెళ్లిళ్లలో విచ్చలవిడిగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. పొట్టలో పట్టేంత కాకుండా.. ప్లేటు నిండా ఆహారాన్ని వడ్డించుకుని చివరికు తినలేక దాన్ని పారేస్తున్నారు. ఫలితంగా ఎంతో ఆహారం చెత్తకుప్పల పాలై వృథా అవుతోంది.
పెళ్లిళ్లలో ఆహారం వృథాకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ అవినీష్ శరణ్ ట్విట్టర్లో ఓ ఫొటో పోస్టు చేశారు. అందులో ఓ టేబుల్ పై వివిధ ఆహార పదార్థాలతో నిండిన ప్లేట్లు, స్వీట్లతో నిండిన గిన్నెలు, వాటర్ బాటిళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫొటోను పరిశీలిస్తే అదంతా సగం తిని వదిలేసినట్లు అర్థమవుతుంది. ఇలా ఆహారాన్ని వృథా చేసే వ్యక్తులను ఏ ఫంక్షన్కు పిలవొద్దని క్యాప్షన్ పెట్టాడు. ఫిబ్రవరి 2న చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
©️ VIL Media Pvt Ltd.