Leave Encashment Rule: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. పెద్ద ప్రకటనల్లో ఒకటి కొత్త లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు. ఈ ప్రకటనతో ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు శుభవార్త అందించారు. లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ పై (Leave Encashment) పన్ను మినహాయింపును రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది.
బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్ది రోజులకు రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. రూ.22 లక్షలకు 30 శాతం మేర బెనిఫిట్ వచ్చినట్లయితే దాదాపుగా రూ.7 లక్షలు లబ్ధి చేకూరుతుంది. ఒక ఉద్యోగికి 30 నుంచి 35 ఏళ్ల వరకు ఈ మినహాయింపులు లభించినట్లయితే.. ఏడాదికి రూ.20 వేలకుపైగా లాభం చేకూరుతుందని తెలిపారు. ‘ వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లించే వారిలో 50 శాతం మంది వేతన జీవులే. అలాంటి వారికి రిటైర్‌మెంట్ సమయంలో కొత్త లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ మినహాయింపు ప్రతిపాదన లబ్ధి చేకూర్చుతుంది. వారు కొత్త ట్యాక్స్ విధానం లేదా పాత పన్ను విధానం ఏది ఎంచుకున్నా ఈ ప్రయోజన చేకూరుతుంది. మరోవైపు.. ఈ కొత్త లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ ఎగ్జెంప్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకూ బెనిఫిట్స్ అందిస్తుంది. వారు ఏయిమ్స్ కోసం పని చేసినవారితో సహా అందిరికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ‘ అని తెలిపారు మల్హోత్రా.
Adani Loans: ‘..అయినా అదానీకి లోన్ ఇస్తాం’.. ప్రభుత్వ బ్యాంక్ కీలక ప్రకటన
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటే ఏమిటి?
భారతీయ కార్మిక చట్టం ప్రకారం.. ప్రతి వేతన జీవికి ఏటా కొన్ని పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అయితే, వాటిన్నింటిని ఉద్యోగులు ఉపయోగించుకోవడం వీలుపడకపోవచ్చు. అలాంటి వినియోగించని పెయిడ్ లీవ్స్ మరో ఏడాదికి పొడగించడం జరుగుతుంది. అలా అవి రిటైర్‌మెంట్ లేదా ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ఉపయోగించుకోని పెయిడ్ లీవ్స్ కి ఎంప్లాయర్ పరిహారం చెల్లిస్తారు. దీనినే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటారు.
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ట్యాక్స్ పడుతుందా?
లీవ్ ఎన్‌క్యాష్ చేసుకోవడం ద్వారా వచ్చే నగదుపై పన్ను కట్టాల్సిందే. లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ ద్వారా వచ్చే డబ్బులు సాలరీకి జత చేసి ట్యాక్స్ వేస్తారు. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫామ్ 10ఈ ద్వారా లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ పై ట్యాక్స్ రిలీఫ్ పొందవచ్చు. ప్రభుత్వం నాన్ గవర్నమెంట్ సాలరీడ్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిన నేపథ్యంలో లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
Google Engineer: కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన గూగుల్ ఇంజినీర్.. ఇంతలో ఆమెకు మెసేజ్.. తెరిచి చూస్తే!
Google Employee Fired: గూగుల్ ఉద్యోగి కన్నీటి గాథ.. క్యాన్సర్‌తో అమ్మ చనిపోయిందని తెలిసినా..