ఒక్కటి తగ్గిందని రూ.70 లక్షల ఫైన్.. ఆ ఎయిర్‌లైన్స్ చేసిన తప్పేంటి?

Air Vistara: పౌర విమానయాన రెగ్యులేటరీ సంస్థ డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ఎయిర్‌లైన్స్‌కు రూ.10 లక్షల ఫైన్ వేసింది. తాజాగా మరో విమానయాన సంస్థకు షాక్ ఇచ్చింది డీజీసీఏ. ఎయిర్ విస్తారాకు ఏకంగా రూ.70 లక్షలు జరిమానా విధించింది. దేశంలోని ఈశాన్య ప్రాంతానికి తప్పనిసరిగా నడపాల్సిన విమానాల టార్గెట్‌ కన్నా తక్కువ విమానాలు నడపినందుకు ఈ ఫైన్ విధించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 2022లో తీసుకొచ్చిన ఈ నిబంధనలను ఉల్లంఘించిన క్రమంలో గత ఏడాది అక్టోబర్‌లోనే ఈ ఫైన్ విధించినట్లు తెలిపింది.

ఈ విషయంపై విస్తారా అధికార ప్రతినిధి మాట్లాడారు. ‘ రూట్ డిస్రెర్సల్ గైడ్‌లైన్స్- ఆర్‌డీజీని గత కొన్నేళ్లుగా విస్తారా కచ్చితంగా పాటిస్తోంది. ఆర్‌డీజీ రూల్‌లో పేర్కొన్న విధంగా వివిధ కేటగిరీల్లో ఎక్కువ విమానాలను తిప్పుతున్నాం. అయితే, బాగ్దోగ్రా ఎయిర్ పోర్ట్ మూసి వేసిన క్రమంలో కొన్ని విమానాలు రద్దయ్యాయి. దీంతో 2022, ఏప్రిల్‌లో టార్గెట్‌ కన్నా 0.01 శాతం తక్కువయ్యాయి. కేవలం ఒక్క ఫ్లైట్ మాత్రమే తక్కువగా నడిచింది. శీతాకాలం 2017-18 నుంచి అమలులోకి వచ్చిన కొత్త పౌర విమానయాన విధానం ప్రకారం.. ఏఎస్‌కేఎంల ట్రేడింగ్ కూడా నిలిచిపోయింది. అటువంటి సందర్భాలలో ఏదైనా చివరి నిమిషంలో సర్దుబాట్లు చేయడానికి విమానయాన సంస్థలకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిమితం చేసింది.’ అని పేర్కొన్నారు.

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 మార్గాలతో మీ మొబైల్‌లోనే పూర్తి వివరాలు

మీడియా నివేదికల ప్రకారం విస్తారా అవైలేబుల్ సీట్ కిలోమీటర్స్ (ఏఎస్‌కేఎం) ఏప్రీల్‌లో 0.99 శాతంగా ఉంది. ఈశాన్య రూట్లలో 1 శాతం ఉండాలన్న నిబంధనలకు 0.01 శాతం తక్కువగా ఉంది. ఒక్క విమానం రద్దు అయినందుకు భారీగా జరిమానా వేసింది డీజీసీఏ. ప్రతి సెక్టార్‌లో కనీసం నడపాల్సిన విమానాల సంఖ్యను విమానయాన సంస్థలు అందుబాటులో ఉంచాలి.

ఏప్రిల్ 2017లో తొలిసారి ప్రాంతీయ అనుసంధానం స్కీమ్ ఉడాన్ (Ude Desh ka Aam Nagrik) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఈ స్కీమ్ కింద తొలి విమానం నడిచి ఐదేళ్లు పూర్తయ్యాయి. టైర్ 2, టైర్ 3 నగరాల ప్రజలకు సైతం విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తొలిసారి 2016లోఈ ఉడాన్ కార్యక్రమంపై అంకురార్పణ చేశారు.

Read Latest

Business News and Telugu News

టెక్ ఉద్యోగులపై పిడుగు.. 6,500 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ.. లాభాలు తగ్గటమేనటా!

‘..అయినా అదానీకి లోన్ ఇస్తాం’.. ప్రభుత్వ బ్యాంక్ కీలక ప్రకటన

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *