కష్టాల్లో తండ్రి.. కొడుకుకు పెద్ద బాధ్యత! అదానీ కుమారుడు ఏం చేస్తారో తెలుసా?

Adani Son: అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసిన తర్వాత అదానీ గ్రూప్ సంస్థలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అదానీ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపది 60 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు కరణ్ అదానీకి పెద్ద బాధ్యతలు అప్పగించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎకనామిక్ అడ్వైసరీ కౌన్సిల్ (EAC) కమిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర.. గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీని (Karan Adani) అందులో చేర్చింది. కరణ్ అదానీతో పాటు ముకేశ్ అంబానీ కుమారు అనంత్ అంబానీ (Ananth Ambani) సైతం కమిటీలో మెంబర్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితని మెరుగుపరిచేందుకు అదానీ, అంబానీల కుమారులు మహారాష్ట్రకు సలహాలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో గౌతమ్ అదానీ కుమారుడి గురించి తెలుసుకుందాం.

మహారాష్ట్ర ఈఏసీ కమిటీకి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేకరన్ నేతృత్వం వహిస్తున్నారు. అందులో మొత్తం 21 మంది ఉండనా, అదానీ, అంబానీల కుమారులు సైతం భాగస్వామయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితని పురోగమించేలా ప్రభుత్వానికి ఈ కమిటీ సలహాలు, సూచనలు చేయనుంది. అయితే అదానీ గ్రూప్‌లో కరణ్ అదానీ పెద్ద బాధ్యతలే నిర్వర్తిస్తున్నారు. అదానీ పోర్ట్ బిజినెస్ చూసుకుంటున్నారు. దాంతో పాటు అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారం సైతం కరణ్ చేతిలోనే ఉంది.

97684150

కరణ్ అదానీ గురించి..

కరణ్ అదానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1987, ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. పాడూ యూనివర్సిటిలో డిగ్రీ పూర్తి చేశారు. 2017 నుంచి అదానీ పోర్ట్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. అలాగే.. అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్ వ్యాపారాలను సైతం పర్యవేక్షిస్తున్నారు. ఈ కంపెనీలకు ఆయన ఒక డైరెక్టర్ కూడా. ఎసీసీ లిమిటెడ్‌లో ఛైర్మన్‌గా నామినేటెడ్ అయ్యారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2013లో కరణ్ అదానీకి పరిధి ష్రాఫ్‌తో వివాహం జరిగింది. ఆమె ఒక కార్పొరేట్ లాయర్.

అదానీ చిన్న కుమారుడు..

గౌతమ్ అదానీ చిన్న కుమారుడి పేరు జీత్ అదానీ. జీత్ చేతిలో సైతం పెద్ద బాధ్యతలే పెట్టారు గౌతమ్ అదానీ. 2019 నుంచి గ్రూప్ కంపెనీల్లో కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. అదానీ ఎయిర్ పోర్ట్ బిజినెస్ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు.

Read Latest

Business News and Telugu News

Also Read:

Google Engineer: కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన గూగుల్ ఇంజినీర్.. ఇంతలో ఆమెకు మెసేజ్.. తెరిచి చూస్తే!

97645063

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *