జీరో 5G 2023, జీరో 5G 2023 టర్బో ఫోన్స్‌ లాంచ్‌ చేసిన ఇన్‌ఫినిక్స్‌.. ఫీచర్లు, ధరల వివరాలు

ఇండియన్‌ మొబైల్‌ (Mobile) మార్కెట్‌లోకి కొత్త 5జీ ఫోన్‌ (5G Phones) లు అడుగుపెడుతున్నాయి. డిమాండ్‌ ఆధారంగా అన్ని కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో ప్రొడక్టులను పెంచుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌(Infinix) ఇండియన్‌ మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. జీరో సిరీస్‌లో జీరో 5G 2023(Zero 5G 2023), ఇన్‌ఫినిక్స్‌ జీరో 5G 2023 టర్బో(Zero 5G 2023 Turbo) అనే రెండు లేటెస్ట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో చాలా స్పెసిఫికేషన్‌లు ఒకే విధంగా ఉంటాయి, అయితే హ్యాండ్‌సెట్‌ల స్టోరేజ్‌, చిప్‌సెట్‌లో తేడా ఉంటుంది. 5జీ డివైజ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేశారు. ఫిబ్రవరి 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు వీటి ధర, స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయో? తెలుసుకుందాం.

* స్పెసిఫికేషన్‌లు ఇలా

రెండు హ్యాండ్‌సెట్‌లు 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తాయి. ఇవి Mediatek చిప్‌సెట్ ద్వారా రన్‌ అవుతాయి. జీరో 5G 2023 డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ.17,999గా ఉంది. అదే విధంగా జీరో 5G 2023 టర్బో డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. ఈ డివైజ్‌ ధర రూ.19,999గా ఉంది.

ఇన్‌ఫినిక్స్‌ జీరో 5G 2023, జీరో 5G 2023 టర్బో స్మార్ట్‌ఫోన్‌లు 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆప్షన్‌తో వస్తాయి. XOS 12 లేయర్డ్ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. ఈ హ్యాండ్‌సెట్‌లలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీతో బ్యాకప్ ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఎక్కడైనా స్మార్ట్‌ఫోన్‌ మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి.. లేదంటే అంతే సంగతులు..

హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్, Wi-Fi 6 సపోర్ట్‌ వంటి ఇతర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 16MP ఫ్రంట్ షూటర్‌తో వస్తాయి. వెనుక ప్యానెల్‌లో అల్ట్రా నైట్‌స్కేప్ ఫోటోగ్రఫీతో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లు 8.9mm థిక్‌, 199 గ్రాముల బరువు కలిగి ఉంటాయి.

* సేల్‌ ఆఫర్‌లు

రెండు ఫోన్‌లు పెర్లీ వైట్, కోరల్ ఆరెంజ్ విత్ వేగన్ లెదర్ బ్యాక్, సబ్‌మెరైన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇన్‌ఫినిక్స్‌ జీరో 5G 2023 సిరీస్ సేల్స్‌ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 11న మొదలవుతాయి. ఇన్‌ఫినిక్స్‌ జీరో 5Gపై రూ.1500, ఇన్‌ఫినిక్స్‌ జీరో 5G 2023 టర్బోపై రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 11 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *