Women’s T20 World Cup 2023 : దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా ఫిబ్రవరి 10న మహిళల టి20 ప్రపంచకప్ (Women’s T20 World Cup 2023)కు తెర లేవనుంది. భారత్ (India)తో సహా మొత్తం 10 జట్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఈ క్రమంలో భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్ ను ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఆడనుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో ఇందులో జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేయొచ్చు.. అదే సమయంలో ప్రతి ఒక్కరు తమ కోటా వరకు బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రపంచకప్ లో భారత ప్రయాణం అంత సులభంగా సాగే అవకాశం లేదు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్.. పాకిస్తాన్, ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్ లతో మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఇందులో ఇంగ్లండ్ మాత్రమే భారత్ కంటే బలంగా కనిపిస్తుంది. దాంతో సెమీస్ చేరడం భారత్ కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే సెమీస్ నుంచే అసలు పోటీ మొదలవ్వనుంది. నాకౌట్ ఫోబియాను అధిగమించాలంటే అన్ని విభాగాల్లోనూ ఎలాంటి పరిస్థితులోనైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ భారత్ ను కలవర పెడుతుంది. ట్రై సిరీస్ లో స్మృతి మంధాన పెద్దగా రాణించలేదు. గత 10 మ్యాచ్ ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే అర్ధ సెంచరీలు చేసింది. ఆమెతో పాటు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లు కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అండర్ 19 ప్రపంచకప్ కెప్టెన్ షఫాలీ వర్మ, రిచా ఘోష్ ల రూపంలో పవర్ హిట్టర్స్ ఉన్నా వీరిలో నిలకడ లేదు. భారత బౌలింగ్ ఫర్వాలేదు. అయితే రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ తమ లోటు పాట్లను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
టీమిండియా జట్టు
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, దేవిక, పూాజ, యస్తిక భాటియా, అంజలి శర్వాణి, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, రేణుక సింగ్
ఆస్ట్రేలియా జట్టు
మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), అలీసా హేలీ, బ్రౌన్, గార్డ్ నర్, కిమ్ గ్రాత్, హీథర్, హ్యారీస్, సెస్ జొనాసెన్, అలాన కింగ్, తాలియా మెక్ గ్రాత్, బెత్ మూనీ, పెర్రీ, సథర్ ల్యాండ్, మేగాన్ షూట్, వారెమ్