Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరవాసులు ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న డబుల్ డెక్కర్ బస్సులు నగరానికి వచ్చేశాయి. గతంలో మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన మాట మేరకు.. నగరానికి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ తీసుకొచ్చింది. ఇవి త్వరలోనే హైదరాబాద్ నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఇక బస్సుల విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 300 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఇప్పటికే.. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముందుగా చెప్పారు. అయితే.. అందులో 10 డబుల్ డెక్కర్ బస్సులుంటాయని ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి తీసుకొచ్చారు.
ఓపెన్ టాప్, స్టైల్‌లో టాప్ క్లాస్..
అయితే.. బస్సులు నీలం రంగులో చూస్తూంటేనే ఎప్పుడెప్పుడు ఎక్కి.. అందులో ప్రయాణం ఆస్వాధించాలన్న కుతూహలం కలిగేలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల మాదిరిగానే.. కింది భాగంలో సీటింగ్ ఉండగా.. ఇందులో పైన కూడా అదనంగా సీటింగ్ ఉంది. పెద్ద పెద్ద అద్దాలతో ఎంతో హుందాగా.. ఉన్న ఈ బస్సులు.. అమెరికా లాంటి దేశాల్లో తిరిగే బస్సులను తలపిస్తున్నాయి. అయితే.. కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ కూడా ఉంది. నగరంలో ప్రముఖ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్న ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు… జర్నీతో పాటు హైదరాబాద్ అందాలను ఆస్వాధించేలా.. బస్సులకు ఓపెన్ టాప్ ఇవ్వటం విశేషం. ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తున్నాయన్న వివరాలు ప్రదర్శించేలా పెద్దగా డిస్‌ప్లే కూడా ఉంది.
కాగా.. ఈ బస్సులు హైదరాబాద్‌కు చేరుకున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నగరవాసులతో పంచుకున్నారు. గతంలో మంత్రి కేటీఆర్‌కి ఇచ్చిన హామీ మేరకు డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయని.. త్వరలోనే ఈ బస్సులు నగర రహదారులపై పరుగులు తీయనున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ బస్సుల ఫొటోలు చూసిన నెటిజన్లు.. తెగ షేర్లు చేస్తున్నారు. బస్సు చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు ఎక్కి ప్రయాణం చేస్తామా అని వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.
97696488
97693753
Read More Telangana News And Telugu News