తిరుపతి దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి

Jangaon: జనగామ జిల్లా పెందుర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఆగిఉన్న డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం, డ్రైవర్, క్లీనర్‌తో పాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కొండాపూర్ చెందిన మిర్యాల దేవేందర్ రెడ్డి కుటుంబంతో సహా రెండ్రోజుల క్రితం తిరుపతికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. అనతరం తిరుగుపయనమై.. కాజీపేట రైర్వేస్టేషన్‌లో ట్రైన్ దిగి కారులో హైదరాబాద్ బయల్దేరారు. అదే సమయంలో వరంగల్ జనగామ హైవేపై వెళ్తున్న డీసీఎం వాహనం టైర్ పంక్చర్ కావటంతో రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్, క్లీనర్ టైర్ మారుస్తున్నారు. పొగమంచు కారణంగా డీసీఎం వాహనాన్ని గుర్తించని దేవందర్ రెడ్డి కారు వేగంగా వెళ్లి డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ క్రమంలో డీసీఎం టైర్ మారుస్తున్న డ్రైవర్, క్లీనర్‌తో పాటు కారు డోర్ తెరుచుకొని కారులో ప్రయాణిస్తున్న దేవేందర్ రెడ్డి కూతరు శ్రీహిత రోడ్డుపై పడిపోయి చనిపోయింది. ప్రమాదంలో దేవేందర్ రెడ్డి ఆయన భార్య శ్రీవాణికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా.. మృతి చెందిన డ్రైవర్, క్లీనర్ వివరాలు తెలియాల్సి ఉంది.

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *