త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి: కేటీఆర్ త్వరలో హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సుల ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ లో త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం TSRTC ఆధునిక హంగులతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
2020 నవంబర్ 7న మంత్రి కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సులపై ట్వీట్ చేశారు. తాను అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించిన జ్ఞాపకాలు ఉన్నాయని.. చాన్స్ ఉంటే మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ హామీని నెరవేర్చారని ట్వీట్ చేశారు.
©️ VIL Media Pvt Ltd.