దిగ్గజ కంపెనీలకు ఏమైంది.. ఐటీ ఉద్యోగులకు కష్టకాలం.. ఈ గణాంకాలు చాలవా చెప్పడానికి..!

IT Employees: ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు కూడా లేఆఫ్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఇంటర్నల్ అసెస్‌మెంట్ టెస్ట్ క్లియర్ చేయలేదని 600 మంది ఫ్రెషర్లను తీసేసింది. ఆన్‌బోర్డింగ్ చేయకుండా ఇంటికి పంపించింది. అంతకుముందు విప్రో కూడా ఇదే పేరుతో దాదాపు 800 మంది ఉద్యోగులను పీకేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నిజమేనన్న భావన కలుగుతుంది. భారత్‌కు చెందిన 7 దిగ్గజ ఐటీ కంపెనీల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కొత్త ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో పాటు.. మొత్తం ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గడం కలవరపాటుకు గురిచేస్తోంది.

వీటిల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, L&T టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే మొత్తం ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, టెక్ మహీంద్రా, LTIMINDTREE మాత్రం ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల చూపించాయి. ఇన్ఫీ, హెచ్‌సీఎల్, L&T మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పటికీ.. అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే కొత్తగా చేరిన ఉద్యోగుల సంఖ్యలో క్షీణత నమోదు చేసింది. వీటన్నింటి హెడ్ కౌండ్ కొత్తగా 5,203 మాత్రమే కావడం గమనార్హం.

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

అయితే సిబ్బంది వలసలు మాత్రం గతంతో పోలిస్తే తగ్గడం ఒక్కటే సానుకూల పరిణామం అని చెప్పొచ్చు. మరో త్రైమాసికం కూడా ఇలా ఉద్యోగుల నియామకాల్లో ఈ ఐటీ కంపెనీలు వెనుకంజ వేయొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ Xpheno, రీసెర్చ్ ఫర్మ్ ఎవరెస్ట్ గ్రూప్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తొలి దశ విజృంభించిన 2020 ఏప్రిల్- జూన్ త్రైమాసికం తర్వాత ఇదే తక్కువ అని చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలోనే కొత్త నియామకాలు మళ్లీ పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఎవరెస్ట్ గ్రూప్ దాదాపు 56 ఐటీ కంపెనీలను సర్వే చేయగా.. అవన్నీ 2023లో 10 నుంచి 12 శాతం వరకు హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది.

అదానీ ఇష్యూ ఒక కంపెనీ సమస్య.. భారత్‌పై దాడి కాదు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఆయా కంపెనీలు. ఈ లిస్ట్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో.. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం వాటికి కనిపించట్లేదట. ఈ ఏడాది తొలుత గూగుల్, మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్‌ను ప్రకటించాయి. ఇక గూగుల్ ఉద్యోగులు.. తమ లేఆఫ్స్ గాధలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

గౌతమ్ అదానీ కంపెనీకి భారీ లాభం.. ఏకంగా 77 శాతం జంప్.. హిండెన్‌బర్గ్ దెబ్బకొట్టినా..!

97672775

97635797

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *