నాగ్‌పుర్‌లో టెస్టు.. రికార్టులలో మనదే పైచేయి ఫిబ్రవరి 9 నుంచి భారత్,అస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా నాగాపూర్ వేదికగా ఫస్ట్ టెస్టు స్టార్ట్ కానుంది. మరి నాగ్‌పుర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. దాదాపు ఐదేళ్ల తర్వాత నాగ్‌పుర్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగబోతోంది. చివరిసారిగా ఇక్కడ 2017 నవంబర్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 239 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
ఇక ఇప్పటివరకు ఈ స్టేడియంలో మొత్తం ఆరు టెస్టులు జరగగా ఇందులో నాలుగింటిలో టీమిండియా గెలిచి ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2010లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. విదర్భ స్టేడియంలో ఫస్ట్ టెస్టు మ్యాచ్ భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్యే జరగడం విశేషం. ఈ మ్యాచ్ లో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు ( 610/6 డిక్లేర్డ్ శ్రీలంకపై భారత్) గా ఉంది. ఇక అత్యల్ప స్కోరు ( 79 దక్షిణాఫ్రికాపై భారత్ )గా ఉంది.
©️ VIL Media Pvt Ltd.