బాలయ్య NBK 108 కోసం భారీ డిమాండ్‌.. కోట్లలో కాజ‌ల్‌ రెమ్యూన‌రేష‌న్‌

ఒక‌ప్పుడు పెళ్లైతే హీరోయిన్స్‌కి క్రేజ్ త‌గ్గేది. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆ స్టేజ్‌లోనూ రాణించారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం అలా ఉండ‌టం లేదు. పెళ్లైనా, త‌ల్లైనా సినిమా రంగంలో రాణిస్తూనే ఉన్నారు. అదే కేట‌గిరీలో నేనేం త‌క్కువ తిన్నానా! అని అంటోంది హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. పెళ్లికి ముందు క్రేజీ సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చినా ఫ్యామిలీ కోసం తిర‌స్క‌రిస్తూ వ‌చ్చిన ఈమె ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్ప‌టికే ఇండియ‌న్ 2లో క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి న‌టించి రైట్ ట్రాక్‌లోనే ఉన్న‌ట్లు రుజువు చేసేసింది. దీంతో ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు అవ‌కాశం వ‌చ్చింది. అదే నంద‌మూరి బాల‌కృష్ణ 108వ చిత్రం.

ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ చిత్రం NBK 108 పేరుతో రూపొందుతోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించ‌గ‌ల‌డే పేరున్న డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ‌, వీర సింహా రెడ్డి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ కావ‌టంతో NBK 108పై భారీ అంచ‌నాలున్నాయి. రొటీన్‌కి భిన్నంగా అనీల్ రావిపూడి యాక్ష‌న్ పంథాలో బాల‌య్య‌ను చూపించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప‌లు సందర్భాల్లో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు బాల‌కృష్ణ NBK 108లో హీరోయిన్ శ్రీలీల తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తారు. అంటే కాజ‌ల్ అమ్మ‌గా న‌టిస్తుందా? ఆమె పాత్ర ఎలా ఉంటుంద‌నేది అందరిలోనూ ఆస‌క్తిని రేపుతోంది. అయితే ఈ పాత్ర‌లో న‌టించ‌టానికి కాజ‌ల్ భారీ రెమ్యూన‌రేష‌న్‌ను డిమాండ్ చేసింద‌ట‌. నెట్టింట వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసింది. అయితే బాల‌కృష్ణ‌తో కాజ‌ల్ అయితే వారి జోడీ కొత్త‌గా కనిపిస్తుంద‌ని, ఎలాగూ ఆమెకంటూ క్రేజ్ ఉండ‌టం కూడా క‌లిసొచ్చే అంశం కావ‌టంతో మేక‌ర్స్ కాజ‌ల్ అడిగిన మొత్తాన్ని ఇవ్వ‌టానికి రెడీ అయ్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే NBK 108 ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నెల మూడో వారంలో సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌టానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేశారు. సినిమాను స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై మ‌రింత క్లారిటీ రానుంది.

ALSO READ:

97687832

ALSO READ :

Nagababu: కుహ‌నా మేధావుల్లారా ఏడ‌వ‌కండి.. సినీ విమర్శకులపై నాగ‌బాబు ఫైర్

ALSO READ:

Allu Aravind: అల్లు అర‌వింద్‌కే దిల్ రాజు షాక్.. ప‌ర‌శురాంపై అసంతృప్తి!

Read Latset

Tollywood Updates

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *