మెడలో పాము, ఒడిలో పులితో విజయ్ దేవరకొండ గేమ్స్.. రౌడీ స్టార్ ఫియర్‌లెస్ ఫీట్స్

టాలీవుడ్‌లో రౌడీ స్టార్‌గా ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). తన చివరి చిత్రం ‘లైగర్’ (Liger) నిరాశపరచగా.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ (Kushi) మూవీపై ఫోకస్ చేశాడు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా షర్ట్‌లెస్ ఫొటో షేర్ చేసి అమ్మాయిలకు కునుకు లేకుండా చేసిన విజయ్.. తాజాగా దుబాయ్‌ (Dubai)‌లో పాములు, పులులతో ఆడుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ ట్రిప్ వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడి ఫేమ్ పార్క్‌ (Fame park) సందర్శించాడు. సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ జూ పార్క్‌లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగానే పాములను మెడలో వేసుకున్న విజయ్.. భారీ సైజు పైథాన్స్‌ను ఒంటిపై పాకించుకున్నాడు. అక్కడి పక్షులు, కోతులు వంటి చిన్న చిన్న జంతువులకు ఫుడ్ తినిపిస్తూ కనిపించాడు. అంతేకాదు బోనులో ఉన్న సింహంతో తాడు ఆట ఆడిన విజయ్.. పులి పిల్లలను ఒళ్లో ఆడించడంతో పాటు వాటికి పాలు కూడా పట్టాడు. మొత్తానికి జంతువులు, పక్షులతో తన టైమ్‌ను ఎంజాయ్ చేశాడు.

జూపార్క్‌లో మూగ జీవాలతో తాను గడిపిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన విజయ్ ఒక నోట్ కూడా జోడించాడు. బ్యూటిఫుల్ పార్క్, ఇక్కడ జంతువులను బాగా చూసుకునే సంరక్షకులు ఉండటం సంతోషాన్నిచ్చింది. పాములంటే ఉన్న భయాన్ని పోగొట్టారు. జంతువుల గురించి చాలా నాలెడ్జ్‌ను నాతో పంచుకున్నారు. క్యూటెస్ట్ సింహం, పులి పిల్లలతో ఆడుకునేలా చేశారు’ అని రాసుకొచ్చాడు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, విజయ్ త్వరలోనే మొదలయ్యే ‘ఖుషి’ షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యం కారణంగానే ఇన్ని రోజులు షూటింగ్ నిలిచిపోగా.. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో తిరిగి పట్టాలెక్కనుంది. ఇది కాకుండా ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో రీసెంట్‌గా మరో ప్రాజెక్ట్‌కు విజయ్ సైన్ చేశారు. ఈ చిత్రంతో తను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే తనకు ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురాంతో మరో సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. అయితే ఈ సినిమా విషయంలో దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్య క్లాస్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *