మోదీని ఇండియా నమ్ముతుంది..అదానీకి ఎందుకిచ్చారని మీ బావని అడుగు..రాహుల్ కి బీజేపీ కౌంటర్

BJP to Rahul Gandhi over Adani allegations : ప్రముఖ పారిశ్రావికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani)తో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి సంబంధం ఏంటని,బీజేపీకి ఆయన ఎంత ఇచ్చారంటూ ఇవాళ లోక్ సభలో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధన్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ(BJP) తిప్పికొట్టింది. రాహుల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, ప్రధానమంత్రి పైన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వంపైన దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తొలిసారి పార్లమెంటులో మాట్లాడిన రాష్ట్రపతి ప్రసంగంపై ఏమాత్రం గౌరవం లేదన్నారు. రాహుల్ గాంధీకి..మోదీపై చేసిన ఆరోపణలు రుజువు చేయగలిగే ఆధారాలు కానీ, డాక్యుమెంట్లు ఉంటే వాటిని సభకు సమర్పించి ఉండాల్సిందన్నారు. సభలో మాట్లాడింది రాహుల్ కాదని, అసహనమే ఆయనలో కనిపించదని అన్నారు. గతంలో తన హయాంలో బోఫోర్స్,అగస్టా వెస్ట్ ల్యాండ్ వంటి ఎలాంటి కీలకమైన ఒప్పందమూ జరగలేదన్న బాధతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని పైననో, ప్రభుత్వంపైననో తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు తగిన రీసెర్చ్ వర్క్ కానీ, హోం వర్క్ కానీ చేసుంటే బాగుంటుందన్నారు. రాజస్తాన్‌లో మెగాప్రాజెక్టుల కోసం సేకరించిన భూమి గురించి తన బావను రాహుల్ అడిగి ఉండొచ్చు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఉంది. అదానీ, ఆయన గ్రూప్‌లకు ఆ ప్రభుత్వం ఇచ్చిన భూములపై సొంత పార్టీ నేతనే రాహుల్ ప్రశ్నించి ఉండవచ్చు అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

కాగా,కాగా,మోదీ పర్యటించిన దేశాల్లో అదానీకి భారీ కాంట్రాక్టులు దక్కాయని రాహుల్ గాంధీ ఇవాళ లోక్ సభ వేదికగా ఆరోపించారు. గౌతమ్ అదానీ సుమారు 10 రంగాల్లో వ్యాపారం చేస్తున్నార‌ని, 2014 నుంచి 2022 మధ్య ఈ ఎనిమిదేళ్ల కాలంలో అదానీ ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఎలా చేరుకున్నాయని యువ‌త సందేహం వ్యక్తం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. భార‌త్ జోడో యాత్ర స‌మ‌యంలో త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు అంత‌టా ఒక్క‌టే పేరు వినిపించిందని, అందరూ అదానీ గురించే అడుగుతున్నారని రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అదానీతో ఆయనకు అనుబంధం మొదలైందని.. మోదీకి అదానీ నమ్మకంగా ఉండేవాడు. మోదీ,అదానీ కలిసి తిరిగేవారని, 2014లో ఢిల్లీకి మోదీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైంది అని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు అదానీ విమానంలో మోదీ ప్రయాణించేవారని, ఇప్పుడు మోదీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం అంతకు ముందు గుజరాత్‌కు సంబంధించినదని, ఆ తర్వాత భారత దేశానికి సంబంధించినది అయిందని, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని అన్నారు. గడచిన ఇరవయ్యేళ్ళలో బీజేపీకి అదానీ ఎంత సొమ్ము ఇచ్చారని, ఎలక్టొరల్ బాండ్ల ద్వారా ఎంత ముట్టజెప్పారని నిలదీశారు. మోదీ-అదానీ కలిసి ఉన్న ఓ ఫొటోను లోక్‌సభలో ప్రదర్శించారు. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకోడానికి మోదీ సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

Turky thanks india : థ్యాంక్స్ భారత్ దోస్త్..నిజమైన స్నేహితుడంటూ మోదీ సాయంపై టర్కీ కృతజ్ణతలు

భారత్ ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందాల కాంట్రాక్టులన్నీ అదానికే ఇచ్చారని విమర్శించారు. భారత్-ఇజ్రాయెల్ రక్షణ సంబంధాలు అదానీ చేతుల్లోకి వెళ్లాయన్నారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదని, హెచ్ఏఎల్ వాటిని తయారు చేసిందని చెప్పారు. అయినప్పటికీ మోదీ ఇజ్రాయెల్ వెళ్లిన తర్వాత, అదానీకి కాంట్రాక్టు దక్కిందని అన్నారు. అదానీకి రక్షణ రంగంలో అనుభవం శూన్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *