Murali Vijay retirement post: భారత సీనియర్ క్రికెటర్లు మురళీ విజయ్ (Murali Vijay), జోగిందర్ శర్మ (Joginder Sharma) వారం వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించేశారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ గుడ్ బై చెప్తున్నట్లు తొలుత బ్యాటర్ మురళీ విజయ్ సోషల్ మీడియా ద్వారా ఓ స్టేట్‌మెంట్‌ని విడుదల చేశాడు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ కూడా తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఇద్దరి రిటైర్మెంట్ స్టేట్‌మెంట్స్ దాదాపు ఒక్కటే. కేవలం పేర్లు, తేదీలు, తాము ప్రాతినిథ్యం వహించిన రాష్ట్ర క్రికెట్ సంఘం పేర్లని మాత్రమే మార్చారు.
2008లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన మురళీ విజయ్.. 2015 వరకూ భారత్ జట్టులో కొనసాగాడు. ఈ క్రమంలో 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన ఈ ఓపెనర్.. 12 సెంచరీలు సాధించాడు. గత 8 ఏళ్లుగా టెస్టుల్లో మళ్లీ పిలుపు కోసం ఎదురుచూసి.. వీడ్కోలు మ్యాచ్ ఆడకుండానే నిరాశగా గుడ్ బై చెప్పేశాడు.
2004లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జోగిందర్ శర్మ కేవలం మూడేళ్లు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగలిగాడు. 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో.. పాకిస్థాన్‌పై లాస్ట్ ఓవర్ వేసిన జోగిందర్ శర్మ భారత్ జట్టుని గెలిపించి హీరోగా మారాడు. కానీ.. ఆ తర్వాత అతను మళ్లీ పెద్దగా కనిపించలేదు. కెరీర్‌లో కేవలం 4 వన్డేలు, 4 టీ20లు మాత్రమే ఆడిన జోగిందర్ శర్మ.. దేశవాళీలోనూ ఎక్కువ మ్యాచ్‌ల్ని ఆడలేకపోయాడు.
మురళీ విజయ్, జోగిందర్ శర్మ భారత్ జట్టుకి కలిసి ఆడలేదు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. అయితే.. రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్‌లో ఇద్దరూ ఒకే తరహాలో స్టేట్‌మెంట్‌ని రిలీజ్ చేయడంపై నెటిజన్లు ఫన్నీగా జోక్‌లు పేలుస్తున్నారు. కనీసం లైన్స్ కూడా మార్చలేదని సెటైర్లు వేస్తున్నారు.
Read Latest
Sports News
,
Cricket News
,