Stock Market | మూడేళల్లోనే రూ.లక్షకు రూ.2.5 కోట్ల లాభం అంటే మీరు నమ్మగలరా? ప్రాక్టికల్‌గా చూస్తే.. ఇది సాధ్యం కాదు. కానీ ఇలాంటివి స్టాక్ మార్కెట్‌లో (Stock Market) జరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు పొందొచ్చనే దానికి దీన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే మార్కెట్‌లో కేవలం లాభాలు (Money) మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా ఉంటాయి. కొన్ని సార్లు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
బీఎస్‌ఈ లిస్టెడ్ దీప్ డైమండ్ ఇండియా షేరు ఇన్వెస్టర్ల పంట పండించింది. ఈ షేరు భారీ రాబడిని ఇచ్చింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ మార్కెట్ క్యాప్ రూ. 118 కోట్లు మాత్రమే. కానీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించింది. అంతేకాకుండా ఈ కంపెనీ ఒక్క షేరుకు పది షేర్లు ఇచ్చింది. అంటే స్టాక్ స్ల్పిట్ చేసింది. దీంతో ఈ స్టాక్‌లో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. జనవరి 19 నుంచి చూస్తే.. ఈ షేరు అప్పర్ సర్క్యూట్ కొడుతూనే వస్తోంది. దాదాపు 12 సెషన్లలోనే అప్పర్ సర్క్యూట్ నమోదు చేసింది.
వాట్సాప్‌లో హాయ్ అని పెడితే క్షణాల్లో లోన్.. బజాజ్ బంపరాఫర్!
గత నెల రోజుల కాలంలో చూస్తే.. ఈ షేరు ఇన్వెస్టర్లకు 75 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. షేరు ధర కాలంలో రూ. 13 నుంచి రూ. 25 స్థాయికి చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే షేరు 96 శాతం ప్రాఫిట్ ఇచ్చింది. అదే గత ఆరు నెలల కాలంలో చూస్తే.. షేరు 375 శాతం రాబడిని అందించింది. ఇక గత ఏడాది కాలంలో చూస్తే.. ఈ షేరు రూ. 1.27 నుంచి రూ. 25కు చేరింది. 2019 చివరిలో చూస్తే ఈ షేరు ధర కేవలం రూ.1. అంటే మూడేళ్ల కాలంలో చూస్తే.. ఈ షేరు మల్టీబ్యాటర్‌గా నిలిచింది. 2023 జనవరి 20న ఈ షేరు ధర స్ల్పిట్ అయిన ధరతో ట్రేడ్ అయ్యింది. అంటే ఒక్క షేరు పది షేర్లుగా మారింది.
ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో డబ్బే డబ్బు.. చేరితే రూ.4 లక్షలు మీవే!
2019 చివరిలో షేరు ధర రూ.1 మాత్రమే. ఇప్పుడు షేరు ధర రూ. 25. అంటే మూడేళ్ల కిందట ఈ షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి లక్ష షేర్లు వచ్చి ఉంటాయి. ఒకటికి పది షేర్లు విభజన తర్వాత వీరికి 10 లక్షల షేర్లు లభించి ఉంటాయి. ప్రస్తుతం షేరు ధర రూ. 25 వద్ద ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారకి రూ.2.5 కోట్లు లభించి ఉంటాయి. ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.