Indian Railways :
రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్ విభాగంలో 215, వెల్డర్ విభాగంలో 230, మెషినిస్ట్ 05, పేయింటర్ 05, కార్పెంటర్ 05, ఎలక్ట్రిషియన్ 75, మెకానిక్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్
https://rcf.indianrailways.gov.in/
ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల ప్రకారం 10వ తరగతి వరకు చదివి ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఐటీఐ విద్యను కూడా సంబంధిత విభాగంలో పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుల సమర్పణ సమయంలో.. బయోడేటా, పదవ తరగతి, ఐటీఐ సర్టిఫికేట్లలో పేర్కొన్న విధంగా వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్) లేదా.. పాస్‌పోర్ట్ సైజు ఫోటో స్కాన్ చేసి పెట్టుకోవాలి.
Secunderabad : సికింద్రాబాద్ AOC సెంటర్‌లో 1749 జాబ్స్.. ఎంపికైతే రూ.56,900 వరకూ జీతం
AOC Secunderabad Recruitment 2023 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC Secunderabad).. 1749 ట్రేడ్స్‌మ్యాన్ మెట్, ఫైర్‌మ్యాన్ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు గడువు ముగుస్తుంది.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ఫైర్‌మ్యాన్ పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1749
ట్రేడ్స్‌మ్యాన్ మెట్ పోస్టుల సంఖ్య:
1249
ఫైర్‌మ్యాన్ పోస్టుల సంఖ్య:
544
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.aocrecruitment.gov.in/