విజయవాడలో రోడ్డుపై కొండచిలువ కలకలంరేపింది. కనక దుర్గమ్మ కొండ కింద హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా కొండపై నుంచి రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు కొండచిలువను గమనించి మొబైల్స్‌లో వీడియో తీశారు. రోజూ రద్దీగా ఉన్న రోడ్లపైకి ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అటవీశాఖ అధికారులకు విషయం చెప్పడంతో వారు జాగ్రత్తగా పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలవుతోంది.
97683089
అంతేకాదు గతంలో కూడా విజయవాడలో కొండచిలువ కనిపించింది. ప్రసాదంపాడు కార్మిక నగర్ కట్టపై కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. అటవీశాఖ సిబ్బంది కొండ చిలువను జాగ్రత్తగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఈ కొండచిలువ 10 అడగులకుపైగానే పొడవు ఉంది. మళ్లీ ఇప్పుడు కనిపించడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకొని పొలాల మీదుగా నగరంలోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.