విశాఖ: తరగతి గదిలో పిల్లలపై ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు

పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై సీలింగ్ పెచ్చులు ఊడి పడ్డాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ఒకటో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స చేసి, 108 అంబులెన్స్‌లో విజయనగరం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. ప్రమాద వార్త గురించి తెలియగానే పాఠశాల వద్దకు పరుగెత్తుకొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ చిన్నారులను చూసి రోదించిన తీరు పలువురిని కదిలించింది.

నిర్మించి చాలా ఏళ్లు అవుతున్న ఈ పాఠశాల భవనం బాగా పాతబడింది. 1 నుంచి 3వ తరగతి వరకు ఇక్కడ ఒకే గదిలో తరగతులు నిర్వహిస్తుండటం మరింత విచారకరం. ఈ పాఠశాల భవనానికి అధికారులు ఇటీవలే మరమ్మతు చేయించారు. అయితే, పనుల్లో నాణ్యతా లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

97681052

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *