శ్రుతిమించుతోన్న కెమెస్ట్రీ.. ఆ హీటే ‘బీబీ జోడి’కి ప్లస్ అవుతోందా..!?

బిగ్ బాస్ (Bigg Boss Telugu) రియాలిటీ షోని విపరీతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు.. ఇప్పుడు ‘బీబీ జోడి’ (BB Jodi) డాన్స్ షోను కూడా అలాగే ఆదరిస్తున్నారు. బిగ్ బాస్ షోలో తమ రియల్ క్యారెక్టర్లను ప్రేక్షకులకు చూపించిన కంటెస్టెంట్లు.. ఇప్పుడు బీబీ జోడి ద్వారా తమలోని డాన్స్ టాలెంట్‌ను చూపిస్తున్నారు. ఈ డాన్స్‌కు ఆయా కంటెస్టెంట్ల అభిమానులు ఫిదా అయిపోతున్నారు. డాన్స్ అదరగొడుతున్నారని పొగిడేస్తున్నారు. ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బీబీ జోడి జంటలు.. డాన్స్‌లో కొత్తదనాన్ని చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో జంటల కెమిస్ట్రీ శ్రుతిమించుతోందని అనిపిస్తోంది.

ముఖ్యంగా ఈరోజు విడుదలైన తాజా ప్రోమో చూస్తుంటే కంటెస్టెంట్ల మధ్య కెమిస్ట్రీ హద్దులు దాటుతోందని అనిపిస్తోంది. ఈ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమో స్టార్ మా ఈరోజు విడుదల చేసింది. ఈవారం బీబీ జోడిలో కొరియోగ్రాఫర్స్ రౌండ్ ఉంటుంది. కాబట్టి కంటెస్టెంట్స్ నుంచి ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ రాబోతోంది. ఈ విషయం ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అయితే, ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్‌లో రొమాన్స్‌కు కూడా పెద్దపీటే వేశారు. ముఖ్యంగా మెహబూబ్-శ్రీసత్య, అఖిల్-తేజస్వి జంటల మధ్య కెమిస్ట్రీ శ్రుతిమించినట్టు అనిపిస్తుంది.

‘లై’ సినిమాలోని ‘బొమ్మోలే ఉందిరా పోరి’ పాటకు అఖిల్-తేజస్వి డాన్స్ చేశారు. ఈ డాన్స్‌లో భాగంగా తేజస్వి వెనుక భాగాన్ని అఖిల్ చేతితో పాముతూ స్టెప్ వేశాడు. ఇది చూసి జడ్జి సదా కూడా కాస్త ఇబ్బందిగా నవ్వారు. అంటే ఇళ్లలో చూసే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎలా అనిపిస్తుంది? ఇబ్బందిగా ఉండదు? అలాగే, మెహబూబ్-శ్రీసత్య జంట ‘బాహుబలి’ సినిమాలోని మనోహరి పాటకు డాన్స్ చేసింది. ఇక వీళ్ల మధ్య కెమిస్ట్రీ అయితే ఎప్పటిలానే హై-ఓల్టేజ్‌లో ఉంది. ఈ ఎపిసోడ్‌లో అయితే మరిన్ని భంగిమలు ప్రయత్నించినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇళ్లలో చూసే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది నిపించడం ఖాయం. కానీ, యూట్యూబ్‌లో చూసే పోరగాళ్లు మాత్రం వహ్వా వహ్వా అంటున్నారు. బిగ్ బాస్‌కు ఎంకరేజ్ చేసినట్టే తమకు ఇష్టమైన జంటలకు తమ ఎంకరేజ్‌మెంట్‌ను అందిస్తున్నారు. మెహబూబ్-సత్య ఇరగదీస్తున్నారని.. వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ప్రధాన పోటీ మెహబూబ్-సత్య, అఖిల్-తేజస్వి జంటల మధ్యేనని అంటున్నారు. ఇక ఈ షోలో మరో రకమైన వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో కౌశల్, ఫైమాతో రొటీన్ వాదన వినిపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బీబీ జోడి షోతో మరో బిగ్ బాస్ హౌస్‌ను నడిపిస్తున్నట్టు అనిపిస్తోంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *