ఇటీవల కాలంలో ఎక్కువ అంచనాల మధ్య లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) (Nothing Phone(1)). ఈ ఫోన్ మార్కెట్‌లోకి రాకముందే భారీ డిమాండ్ సొంతం చేసుకుంది. గణనీయమైన సేల్స్ కూడా సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం బ్రిటిష్ బేస్డ్ టెక్ కంపెనీ నథింగ్ ఫోన్(1) సక్సెసర్‌గా నథింగ్ ఫోన్ (2) (Nothing Phone(2)) ను త్వరలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మోడల్ నంబర్, లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను MySmartPrice రిపోర్ట్ వెల్లడించింది. తాజా రిపోర్ట్ చెబుతున్న వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* జులై – సెప్టెంబర్ మధ్య లాంచ్ ?
నథింగ్ ఫోన్(2) ప్రపంచవ్యాప్తంగా 2023 మూడో త్రైమాసికం జులై – సెప్టెంబర్ మధ్య లాంచ్ కావచ్చు. భారత్‌లో కూడా అదే సమయంలో అందుబాటులోకి రావచ్చని MySmartPrice రిపోర్ట్ వెల్లడించింది. అయితే ఇప్పటికీ నథింగ్ ఫోన్ (2) కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు.
* స్పెసిఫికేషన్స్ అంచనా
MySmartPrice రిపోర్ట్ ప్రకారం.. నథింగ్ ఫోన్(2) మోడల్ నంబర్ A065 ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండవచ్చు. ఆన్-స్క్రీన్ కంటెంట్ యూసేజ్ ఆధారంగా అడాప్టివ్ డిస్‌ప్లే ఆటోమెటిక్‌గా రిఫ్రెష్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్ ద్వారా రన్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ ఫోన్ గరిష్టంగా 12GB RAM+ 256GB స్టోరేజ్ కెపాసిటీతో రావచ్చు. వర్చువల్‌గా RAMను మరింత విస్తరించుకునే ఆప్షన్ అందిస్తుంది. నథింగ్ ఫోన్ (2)లో 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : ఎక్కడైనా స్మార్ట్‌ఫోన్ మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి.. లేదంటే అంతే సంగతులు..
* ప్రారంభ అంచనా ధర రూ.39,990
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఇందులో మూడు కెమెరాలు 50 MPతో ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 MP కెమెరా ఉండవచ్చు. నథింగ్ ఫోన్(2) జులై 19న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కావచ్చు. దీని ప్రారంభ ధర రూ.39,990గా ఉండవచ్చని అంచనా. బేస్ వేరియంట్ 8GB RAM + 128 GBగా ఉండవచ్చు.
* నథింగ్ NT02 బ్యాటరీ
టిప్‌స్టర్ ముకుల్ శర్మ సైతం ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ వివరాలను అంచనా వేశారు. నథింగ్ ఫోన్(1)లో నథింగ్ NT01 బ్యాటరీ ఉపయోగించారని, దీంతో నథింగ్ ఫోన్ (2)లో నథింగ్ NT02 బ్యాటరీ ఉపయోగించే అవకాశం ఉందన్నారు. నథింగ్ ఫోన్ 1డ్యూయల్-సిమ్ (నానో) 2022 జులైలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 6.55-అంగుళాల ఫుల్-HD+ OLED డిస్‌ప్లే, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.