55 కోట్ల ఫోర్జరీ కేసులో.. నేరాన్ని అంగీకరించిన నవీన్ రెడ్డి..

Naveen Reddy Atluri | సినిమా హీరో నవీన్‌రెడ్డి అట్లూరిని ఇటీవల ఫోర్జరీ కేసులో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవీన్ రెడ్డి రూ.55 కోట్ల మేర మోసం చేశారని ఎన్‌ స్క్వైర్‌ కంపెనీ డైరెక్టర్లు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. అయితే గత రెండు రోజులుగా సీసీఎస్ పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి. తాను మోసం చేశానని.. 38 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఎన్‌ స్క్వైర్‌ కంపెనీకి నవీన్‌ రెడ్డి అట్లూరి గతంలో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో మిగితా డైరెక్టర్స్‌కు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టుపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన డైరెక్టర్లు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బటయపడ్డింది. నవీన్ రెడ్డి రూ. 55 కోట్ల మేర మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవీన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరుపైకి మార్చుకున్నాడు. అంతేకాదు భూ విక్రయాలకు పాల్పడట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *