సెలబ్రిటీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ వరుసపెట్టి పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా నేనింతే హీరోయిన్ అదితి గౌతమ్ (Aditi Gautham) అలియాస్ షియా గౌతమ్ పెళ్లి పీటలెక్కింది. సోమవారం రాత్రి ముంబైలో వైభవంగా ఆమె వివాహం జరిగింది. తన పెళ్లి విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది అదితి గౌతమ్. ఈ వీడియో చూసి ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.
బంధుమిత్రుల సమక్షంలో అదితి గౌతమ్ వివాహం ఘనంగా జరిగింది. ఆమె భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా. ఈయన ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఈ వేడుకలో వేడుకలో హీరోయిన్ ప్రియమణి పాల్గొని సందడి చేశారు. షియాకు ప్రియమణి స్నేహితురాలు కావడంతో ప్రత్యేకంగా ఈ వివాహానికి హాజరయ్యారు. ఆమెతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేసినట్లు సమాచారం. అయితే అదితి గౌతమ్ చేసుకుంది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే అదానిపై క్లారిటీ లేదు.
బాలీవుడ్ మోడల్ అయిన షియా గౌతమ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన నేనింతే మూవీతో ఆమె హీరోయిన్ గా పరిచయమయ్యారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా 2008లో విడుదలైంది. నేనింతే సినిమా బాక్సాఫిస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత షియాకు పెద్దగా సినిమా ఆఫర్స్ లభించలేదు. వేదం సినిమాలో ఓ చిన్న రోల్ చేసి చాలా కాలం తర్వాత పక్కా కమర్షియల్ మూవీలో తళుక్కున మెరిశారు షియా గౌతమ్.
కన్నడలో ఓ సినిమాలో నటించిన షియా.. సంజయ్ దత్ బయోపిక్ సంజు మూవీలో ఓ రోల్ చేశారు. తాజాగా తన పెళ్లి విషయం బయటపెట్టి సడెన్ సర్‌ప్రైజ్ చేశారు హీరోయిన్ షియా గౌతమ్.