Babu Mohan | మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూ మోహన్ ఓ కార్యకర్తపై బూతులతో రెచ్చిపోయాడు. మీతో కలిసి పని చేస్తానని అందోల్ నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్త బాబూ మోహన్ కు ఫోన్ చేశారు. దీనితో నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తపై బాబూ మోహన్ శివాలెత్తారు. మళ్లీ ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా..నేను ప్రపంచ స్థాయి నాయకుడిని..నువ్వెంత అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఎవడ్రా..నా తమ్ముడు అంటూ బాబూ మోహన్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక బాబూ మోహన్ తీరుపై నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే ఈ ఆడియోపై బాబు మోహన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Babu Mohan: బండి సంజయ్ ఎవడ్రా..కార్యకర్తపై బాబూ మోహన్ దుర్భాషలు
