Health Fruit: కేన్సర్ -డయాబెటిస్ వ్యాధుల్ని సైతం దూరం చేసే అద్భుతమైన ఫ్రూట్, తెలిస్తే వదిలిపెట్టరిక

శరీరానికి ఫ్రూట్స్ చాలా ప్రయోజనకరం. ఫ్రూట్స్‌లో ఉండే పోషక గుణాలు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. అందుకే ఫ్రూట్స్ ప్రతిరోజూ తప్పకుండా తినాలి. ముఖ్యంగా యాపిల్, అరటి, ద్రాక్ష, ఆరెంజ్, బొప్పాయి పళ్లు తప్పకుండా తీసుకోవాలి. అయితే హనుమాన్ ఫలం మాత్రం బ్లడ్ ప్రెషర్, మధుమేహం, కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల్ని సైతం దూరం చేస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

హనుమాన్ ఫలం లేదా సోర్‌సూప్ రుచిపరంగా అద్భుతంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా లాభదాయకం. ఈ ఫ్రూట్ శాస్త్రీయ నామం అన్నోనా మురిటాకా. ఈ ఫ్రూట్‌ను ఇంకా గువాన్‌బానా, పంజా పంజా, గ్రేవిఓలా అని కూడా పిలుస్తారు. ఇది కస్టర్డ్ యాపిల్ కుటుంబానికి చెందిన ఫ్రూట్. బయటి భాగం ఆకుపచ్చగా, లోపలిభాగం తెల్లగా ఉంటుంది. పైనాపిల్‌లా చిన్న చిన్న ముళ్లుంటాయి.

పుష్కలంగా విటమిన్ సి

హనుమాన్ ఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరానికి మంచి శక్తి కలుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పటిష్టమౌతుంది. ఈ ఫ్రూట్‌లో, దీని ఆకుల్లో ఫైటోస్టెరాల్, ట్యానిన్, ఫ్లెవనాయిడ్స్ సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫలితంగా మీ శరీరానికి వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం లభిస్తుంది. 

కేన్సర్ సైతం దూరం

హనుమాన్ ఫలం తినడం వల్ల శరీరంలో కేన్సర్ వంటి ముప్పు చాలావరకు తగ్గుతుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల కేన్సర్ నియంత్రణ, చికిత్సకు సులభమౌతుంది. ఓ అధ్యయనం ప్రకారం హనుమాన్ ఫలం రసాన్ని బ్లెస్ట్ కేన్సర్ ట్యూమర్‌ను తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేన్సర్ కణాల్ని ఈ రసం అంతం చేస్తుంది. ఈ ఫ్రూట్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా జీర్ణక్రియ సులభమౌతుంది. మలబద్ధకం సమస్యల్ని దూరం చేస్తుంది. 

బ్లడ్ షుగర్ నియంత్రణలో దోహదం

ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ నియంత్రణలో చాలా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఈ ఫ్రూట్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఫలితంగా బ్యాక్టీరియాను అంతం చేసేందుకు ఉపయోగపడుతుంది. చిగుళ్ల వ్యాధి దూరమౌతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువ. మోకాలి నొప్పులు దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

Also read: Cancer Prevention Tips: ఏ వయస్సు దాటాక కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది, కేన్సర్‌లో ఎన్ని రకాలున్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *