(బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు, హైదరాబాద్)
చిట్టి ఇడ్లీ కొత్తేమీ కాదు. అయితే కర్ణాటక స్టయిల్ లో చిట్టి ఇడ్లీ కేసర్ బాత్ అందిస్తూ హైదరాబాద్ మాదాపూర్ లోని స్వచ్ రెస్టారెంట్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. చిట్టి ఇడ్లీకి, స్వచ్ఛమైన నెయ్యి, మసాలాకారం పోడితో తింటే ఆ టేస్ట్ వేరు. వినియోదారులకు అరుదుగా లభించే ఇలాంటి రుచికరమైన కాంబినేషన్లో టిఫిన్స్ అందిస్తూ మాదాపూర్ లోని స్వచ్ఛ హోటల్ గుర్తింపు సాధించింది. ఇక్కడ కర్ణాటక తరహాలో మసాలా దోస, ఉప్మాలో ఫైనాపిల్ కేసర్ బాత్, గిన్నె సాంబారు ఇడ్లీ వీరి ప్రత్యేకత.
- ఇది సినిమా స్టైల్ దోపిడీ..! ఎదురెళ్లి మరీ డబ్బులిచ్చారు..!
కర్ణాటక రుచులు మన హైదరాబాద్ నగరంలో
కర్ణాటక తరహాలో రుచికరమైన టిఫిన్స్ కోసం వెతికే వారికి హైదరాబాద్ మాదాపూర్ లోని స్వచ్ఛ్ హోటల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక్కడ చిట్టి ఇడ్లీ, క్రిస్పీ మసాలా దోస, కేసర్ బాత్, మిర్చి బజ్జీతో సాంబార్ వీరి ప్రత్యేకత. ఇక్కడ ఏదైనా రూ.60 మాత్రమే. హైదరాబాద్ నగరంలో ఆదివారం ఏదైనా స్పెషల్ టేస్ట్ చూడాలను కునే వారికి స్వచ్ఛ హోటల్ ను ఒకసారి సందర్శించవచ్చు.
కాంక్రీట్ జంగిల్ లో పల్లె వాతావరణం
పల్లెటూరి వాతావరణం థీమ్ తో బెంగళూరు తరహా దక్షిణ భారత టిఫిన్‌లు అందిస్తున్నారు స్వచ్ఛ్ నిర్వాహకులు. ఇక్కడ చుట్టూ మొక్కలతో పొలంలో, చిట్టడవిలోనో టిఫిన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇండోర్, అవుట్ డోర్ సీటింగ్ సదుపాయం ఉంది. స్వచ్ ఉదయం నుండి రాత్రి వరకు చిట్టి ఇడ్లీ, ఉప్మా, కేసర్ బాత్, మసాలా దోస, సాంబార్ వడ, పూరీలను అందిస్తోంది. ఇక సాయంత్రం అయిందంటే రుచికరమైన మిర్చి బజ్జీ, మసాలా వడ కూడా వడ్డిస్తారు. నెయ్యి , మసాలా కారం పొడితో వారి చిట్టి ఇడ్లీలు, కర్నాటక తరహా మసాలా దోస, ఉప్మాతో పైనాపిల్ కేసర్ బాత్, సాంబార్ ఇడ్లీకి ఈ రెస్టారెంట్ ప్రత్యేక డెస్టినేషన్ గా నిలిచింది.
ఎన్టీఆర్ ప్రసంగం ఇష్టమన్న తెలంగాణ సీజే.. కారణం ఇదే..
ఆకర్షించే ప్లేట్స్ రుచికరమైన టిఫిన్స్
ఈ రెస్టారెంట్‌లో టిఫిన్‌లు చిన్న గుండ్రని తెల్లటి ప్లేట్‌లలో అందిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ గందరగోళనికి తావులేదు. ప్రతి టిఫిన్‌కు ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. ఎవరికి ఏది కావాలో నేరుగా అక్కడికే వెళ్లవచ్చు. వారికి కావాల్సింది ఆర్డర్ చేయవచ్చు.
స్వచ్ఛ్ ఎక్కడంటే..?
హైదరాబాద్ మాదాపూర్ లోని 100 ఫీట్స్ రోడ్డులో స్వచ్ఛ్ రెస్టారెంట్ నడుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి నైట్ 8.30 వరకు తెరచి ఉంటుంది. సాయంత్రం వరకు టిఫిన్స్ ఆ తరవాత స్నాక్స్ అందిస్తారు. ప్రతి రోజూ ఇక్కడ వేలాది మంది వారికి కావాల్సిన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.