Hyderabad: మహా శివరాత్రికి శ్రీశైలం వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్

TSRTC Special Buses: తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలో శ్రీశైలం ప్రముఖ శైవక్షేత్రం కావటంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి శ్రీశైలానికి వల్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

జంటనగరాల నుంచి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, ఐఎస్‌ సదన్‌, బీహెచ్‌ఈల్‌, కేపీహెచ్‌బీ పాయింట్లతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఈనెల 16న 36 ప్రత్యేక బస్సులు, 17న 99 బస్సులు, 18న 99 బస్సులు, 19న 88 బస్సులు నడపనున్నట్లు వివరించారు. మిగతా 68 బస్సులను తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నడపనున్నట్లు పేర్కొ్న్నారు.

ఛార్జీల వివరాలను కూడా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఎంజీ బస్‌స్టేషన్‌ నుంచి శ్రీశైలానికి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.600, డీలక్స్‌లో రూ.540, ఎక్స్‌ప్రెస్‌లో రూ.460, నగరంలోని ఇత ర ప్రాంతాల నుంచి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.650, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో రూ.500గా టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు.

ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించామని, ఇతర వివరాల కోసం MGBSలో 9959226250, 9959226248, 9959226257 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలన్నారు. జేబీఎస్‌లో 9959226246, 040-27802203, ఐఎస్‌సదన్‌లో 9959226250, బీహెచ్‌ఈల్‌, కేపీహెచ్‌బీ పాయింట్లలో 9959226149 ఫోన్‌ నెంబర్లకు కాల్ చేసి బస్సు ప్రయాణాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చునని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *