Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్జీవోఎస్ కాలనీలో తెల్లవారుజూమున అతి వేగంగా దూసుకువచ్చిన కారు దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మార్నింగ్ వాకర్స్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధంచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరగ్గానే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో కారులో ప్రయాణిస్తున్న ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కారు దిగి తూలుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలుు విచారణ చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా ప్రమాదానికి గల కారకులెవరో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిజంగా యువకులు మద్యం మత్తులో ఉన్నారా ? లేక ఓవర్ స్పీడ్ కారణంగా కారు కంట్రోల్ కాక యాక్సిడెంట్ జరిగిందా ? అనేది తెలియాల్సి ఉంది.
Read More Telangana News And Telugu News