హైదరాబాద్‌లో మరోసారి గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు పోలీసులు. స్పాల ముసుగులో సీక్రేట్‌గా సాగుతున్న వ్యాపారాన్ని బట్టబయలు చేశారు. పలువురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నగరంలో స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను అదుపులోకి తీసుకొని పునరావాసకేంద్రాలకు తరలించారు.
సిటీలో చాలా రకాల మసాస్ సెంటర్లు వెలిశాయి. అయితే కొందరు మాత్రం ఈ మసాజులు, స్పా సెంటర్లు పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. మసాజ్ థెరపిస్ట్‌ల పేరుతో కొంత మంది యువతులను నియమించుకొని క్రాస్ మసాజ్‌కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్ అండ్ స్పాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్ అండ్ స్పాలో థాయ్‌లాండ్ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు తగిలించి క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది.
ఈ స్పాలన్నీ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే…బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కృష్ణ టవర్‌లో కొనసాగుతున్న ఔరం సెలూన్ అండ్ స్పా, రోడ్ నెం.12లోని హదర్వా హమామ్ స్పా, కిమ్తి స్వేర్‌లోని ఎఫ్2 లగ్జరీ థాయ్ , బంజారాగార్డెన్ బిల్డింగ్‌లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలపై దాడులు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న థాయ్‌లాండ్ యువతులను పునరావాస కేంద్రానికి తరలించి మేనేజర్ సమీర్‌పై కేసు నమోదు చేశారు.
మరోవైపు స్పా నిర్వాహకుడు జంగం సుధాకర్ పరారీలో ఉన్నారు. అలాగే హదర్వ హమామ్ స్పా మేనేజర్ యామిన్ జిలానీ, యజమాని భీమ్‌సింగ్‌లను కూడా అరెస్ట్ చేశారు. వీరంతా ఎలాంటి రూల్స్ పాటించకుండా స్పాలు కొనసాగిస్తున్నారు. స్పాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కస్టమర్ ఎంట్రీ రిజిష్టర్ లేకుండా, జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వీటిని కొనసాగిస్తు న్నట్లుగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.