Kiara Advani New Home : కియారా కాపురం ఉండబోయే ఇంటి విలువ ఎన్ని కోట్లంటే?

Kiara Advani New Home కియారా అద్వాణి సిద్దార్థ్ మల్హోత్రలు నేడు వివాహా బంధంతో ఒక్కటి కాబోతోన్నారు. మామూలుగా అయితే నిన్ననే వీరి పెళ్లి జరిగింది. కానీ నేటి ఆ ముహుర్తాన్ని వాయిదా వేశారు. నేడు జైసల్మీర్‌లోని కోటలో వీరిద్దరి పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రం హాజరు కాబోతోన్నారు. ఇక వీరి పెళ్లికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్‌ ఉపాసన దంపతులు మాత్రమే పాల్గొనబోతోన్నారని టాక్.

కియారా అద్వాణి పెళ్లి వార్తలు గత వారం నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ ఇంత వరకు కూడా తమ పెళ్లి అంటూ అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. తాళి కట్టిన తరువాతే అధికారికంగా చెబుతారేమో చూడాలి. అయితే తాజాగా వీరి పెళ్లి ఖర్చు, వంటకాలు, నగలు, చీరలు వంటి విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి.స

పెళ్లి తరువాత వీరు కాపురం చేయబోయే ఇంటికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా అయితే బాలీవుడ్ సెలెబ్రిటీలు అంతా కూడా జుహులో ఉంటారు. ఇప్పుడు ఈ జోడి కూడా జుహు ఏరియాలోనే ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారట. దాదాపు డెబ్బై కోట్లతో ఈ బిల్డింగ్‌ను సొంతం చేసుకున్నారట.

3,500 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఈ బంగ్లా విలువ డెబ్బై కోట్లని తెలుస్తోంది. మొత్తానికి కియారా, సిద్దార్థ్‌లు మాత్రం కెరీర్‌ను, పర్సనల్ లైఫ్‌ను బాగానే ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. షేర్షా సినిమాతో వీరి ప్రేమ కథ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ జోడి కెమిస్ట్రీకి అంతా ఫిదా అయ్యారు. ఆ చిత్రంలోని పాటలు ఎంతగా హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?

Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *