Kiara Advani Wedding: ఎట్టకేలకు ప్రియుడిని వివాహమాడిన కియారా అద్వానీ.. కానీ?

Sidharth Malhotra – Kiara Advani Wedding: బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా కొన్నేళ్ల పాటు డేటింగ్ తర్వాత రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఎట్టకేలకు ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టారు.  ఈ జంట ముందుగా 6వ తేదీన వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరగ్గా ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీన వివాహం జరిగింది. ఈ రోజు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ సూర్యాగఢ్ ప్యాలెస్ హోటల్‌లో వీరు వివాహం ఘనంగా జరిగింది,

అంతకు ముందు హల్దీ ఈవెంట్, మెహందీ సహా సంగీత్‌లు కూడా ఘనంగా జరిగాయి. ఇక వీరి వివాహ వేడుకలో కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హోత్రా వంటి వారు హారాజయ్యారని తెలుస్తోంది.  అలా బాలీవుడ్  స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. చాలా కాలంగా, అభిమానులు తమ బంధాన్ని అధికారికంగా చూడాలని కోరుకున్నారు.

 కానీ ఇప్పుడు ఈ జంట డబుల్ ఆనందాన్ని ఇచ్చినట్టు అయింది. అదేంటంటే సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పూర్తి ప్రయివేట్ ఈవెంట్లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో మూసివేసిన తలుపుల వెనుక అంటే క్లోజ్డ్ ఈవెంట్లో వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు.

అయితే ఇప్పుడు కొత్తగా పెళ్లయిన ఈ జంట పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో సిద్ – కియారా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు స్పష్టమైంది. ఇక ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సూర్యగఢ్ ప్యాలెస్‌కి చెందిన ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ద్వారా సిద్ధార్థ్ మల్హోత్రా అలాగే కియారా అద్వానీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.

సిద్ధార్థ్ పెళ్లికొడుకుగా ఉన్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఇక అభిమానులు ఇప్పుడు ఈ జంటకు సంబంధించిన మొదటి ఫోటో కోసం ఎదురు చూస్తున్నారు, ఆ ఫొటోలో సిద్ధార్థ్ మరియు కియారా భార్యాభర్తలుగా కనిపిస్తారని వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఆ ఫోటో ఎప్పటికి రిలీజ్ చేస్తారు అనేది. 

Also Read: Ananya Nagalla Hot Photos: పొట్టి బట్టల్లో అనన్య నాగళ్ల అందాల విందు.. కుర్రకారు తట్టుకోగలరా?

Also Read: Das Ka Dhamki postponed: ఇచ్చిపడేద్దాం అంటూనే రిలీజ్ వాయిదా వేసిన విశ్వక్.. అసలు సంగతి అదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *