Mercury Transit in Capricorn 2023 మకరంలోకి బుధుడి సంచారంతో ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు…!

Mercury Transit in Capricorn, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు. ఈ గ్రహాన్ని సంపదకు, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న బుధుడు త్వరలో తన స్థానాన్ని మారనున్నాడు.

Mercury Transit in Capricorn వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే బుధుడి స్థానం బలంగా ఉంటుందో వారికి శుభ ఫలితాలొస్తాయి. అదేవిధంగా ఎవరి జాతకంలో బలహీనంగా ఉంటాడో వారికి అనేక పనుల విషయంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. గ్రహాలలో యువరాజుగా పరిగణించే బుధుడు ఫిబ్రవరి మాసంలో తన స్థానాన్ని మారనున్నాడు. 7 ఫిబ్రవరి 2023 మంగళవారం రోజున ధనస్సు రాశి నుంచి శని సొంత రాశి అయిన మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ధనస్సు రాశి నుంచి ఏడో తేదీ మంగళవారం నాడు ఉదయం 7:11 గంటలకు నిష్క్రమించి.. మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 4:33 గంటల వరకు సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో సూర్యుడితో కలవడం వల్ల బుధాదిత్య రాజ యోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి ఆకస్మిక ధన లాభంతో పాటు.. జీవితంలో పురోగతి సాధించేందుకు ఎన్నో అవకాశాలు దక్కనున్నాయి. ఈ సందర్భంగా ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…

మేష రాశి(Aries)..

ఈ రాశి నుంచి బుధుడు పదో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో తమ పనికి సంబంధించి ప్రశంసలు లభిస్తాయి. మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

Basant Panchami 2023 వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఏ రాశి వారు ఎలా పూజిస్తే.. శుభ ఫలితాలొస్తాయంటే…!

వృషభ రాశి (Taurus)..

ఈ రాశి నుంచి బుధుడు తొమ్మిదో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఎంతో శుభప్రదంగా ఉంటాయి.

తులా రాశి (Libra)..

ఈ రాశి నుంచి బుధుడు నాలుగో స్థానం నుంచి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీకు భౌతిక సుఖాలలో పెరుగుదల ఉంటుంది. మీరు పని చేసే ప్రాంతంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి సంబంధిత పనుల్లో బంపరాఫర్ వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మకర రాశి (Capricorn)..

ఇదే రాశిలోకి బుధుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సూర్యుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల.. సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచనున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. ముఖ్యంగా నిరుద్యోగులు రాజయోగ ప్రభావం నుంచి కొత్త ఉద్యోగావకాశాలను పొందుతారు. మీకు కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుంభ రాశి (Aquarius)..

ఈ రాశి నుంచి బుధుడు పన్నెండో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా రావొచ్చు. మీకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యులకు పూర్తి సహాయం అందుతుంది.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *