రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : పెద్దపల్లి
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రెఢీగా తయారీ ఉన్నవస్తువులపై మాత్రమే ఆశక్తి చూపిస్తారు. ఎందుకు అంటే అంత ఉరుకుల పరుగుల జీవితంలోఆరోగ్య విషయంలో మాత్రంఅంత శ్రద్ధ చూపించకుండా అనారోగ్య సమస్యలను కొనుక్కొని మరి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రిఫైన్డ్ చేసిన ప్లాస్టిక్ కవర్లలో లభించే నూనెలు వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. తినే నూనెలో పోషకాలు తగ్గడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో మళ్లీ పాత పద్ధతులతోగానుగ నూనె అందుబాటులోకి రావడంతో ఆ నూనెలను ఉపయోగించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో అప్పటికప్పుడు పట్టించే నూనెకూడా అందుబాటులో వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్కండేయ కాలనీకి చెందిన రాజు, సుజాత వీరు గత 20 ఏళ్లుగా సూర్య ఆయిల్ బీన్స్ మీల్ నడిపిస్తున్నారు.
ఏ నూనె కావాలన్నా అప్పటికప్పుడు నూనెను తయరు చేసి ఇస్తున్నారు. మొదట్లో వీరు పాత పద్దతుల్లో నూనె విక్రయం చేసేవారు. అయితే, ఈ మధ్య కాలంలో ప్రజలకు ఆయిల్ పై పెరుగుతున్న అవగాహన వల్ల కొంచెం ఎక్కువగా విక్రయం జరుగుతుండడంతోగానుగలు పెట్టుకొని ఎప్పటికప్పుడు లైవ్ లో నూనెను పట్టిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న బిజినెస్ చేస్తున్నారు. వీరిదగ్గర పల్లి నూనె, కొబ్బరి నూనె, అవాల నూనె, నువ్వుల నూనె, ఆముదం నూనె అప్పటికప్పుడు పట్టిస్తున్నారు.
ఇక్కడ లభించే నూనె ధరలు..
ప్రతి రోజు సుమారు వంద కిలోల నూనె అమ్మకం జరుగుతుందని సుజాత అన్నారు. సూర్య బీన్స్ లో లభించే ఆయిల్ ధరలు ఇలా ఉన్నాయి. పల్లి నూనె 350, కొబ్బరి నూనె 320, నువ్వులు 550, ఆంధాన నూనె 500, ఆవాల నూనె 520 ఇలా ఈ రేట్లకు లభిస్తున్నాయను సుజాత తెలిపారు. పల్లీ రిఫైన్డ్ ఆయిల్ షాపుల్లో రూ.170 నుంచి రూ.180కి లభిస్తుంది. గానుగ పట్టిన నూనె కేజీ రూ. 320 కు లభిస్తుంది.20 కేజీల పల్లీలతో 8 కిలోల స్వచ్ఛమైన ఆయిల్ తయారవుతుంది. ఇలా ఏ నూనె అయినా గానుగ పద్ధతిలో తక్కువ నూనె రావడమే కాకుండా, నాణ్యమైన ఒకే పరిమాణంలో ఉండే గింజలనే వాడాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లే గానుగ నూనె ధర సాధారణ ఆయిల్ ధర కంటే ఎక్కువగా ఉంటుందని సుజాత తెలిపారు.
ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది..
గానుగ నూనెలను ఎప్పటికప్పుడుతయారు చేస్తారు. అందుకే వాటికి చక్కటి రుచి, సువాసనతో పాటు పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. సహజంగా నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌లు, ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లెవనాయిడ్లు మొదలైనవన్నీ గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది కూరలో ఉపయోగించి తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.