PM KIASN Scheme Money: పిఎం కిసాన్ స్కీమ్ రూ. 6 వేల నుంచి 8 వేలకు పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

PM KISAN Scheme Money : న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కొక్కసారి రూ. 2 వేల చొప్పున మూడు సమానమైన ఇన్‌స్టాల్‌మెంట్లలో ఏడాదికి రూ. 6,000 మొత్తాన్ని కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాది మొత్తానికి అందించే రూ. 6 వేల ఆర్థిక సహాయాన్ని రూ 8 వేలకు పెంచుతున్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌కి తోడు మరొక ఇన్‌స్టాల్‌మెంట్ పెంచడం ద్వారా 6 వేల మొత్తాన్ని 8 వేలకు పెంచే అవకాశం ఉందనేది ఆ ప్రచారం సారాంశం.

ఇదే విషయమై పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్న చర్చకు రాగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందిస్తూ.. ” ప్రస్తుతానికి కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు ” అని లోక్ సభకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా రిప్లై ఇచ్చారు. 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో మొత్తం రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున మొత్తం 6 వేల రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోంది. 

2022-23 ఆర్థిక సంవత్సరంలోని మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాగా ప్రస్తుతం నాలుగో విడత పిఎం కిసాన్ స్కీమ్ డబ్బుల కోసం సన్నకారు రైతులు ఎదురుచూస్తున్నారు. పిఎం కిసాన్ పథకం ప్రారంభించాకా ఇప్పటి వరకు మొత్తం 12 విడతల్లో రైతులకు ఆర్థిక సహాయం లభించగా 13వ విడత పెట్టుబడి సాయం 2023 హోలీ పండగ రావడానికి ముందే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Fair Price Shops: 3 రోజుల పాటు రేషన్ దుకాణాలు మూసివేత.. ఎందుకంటే

ఇది కూడా చదవండి : PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

ఇది కూడా చదవండి : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు ఎంతంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *