RC 15 Song Shoot : ఐదు వందల మందితో రామ్ చరణ్‌.. శంకర్ భారీ ప్లానింగ్

RC 15 Song Shoot మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ 15వ సినిమా రాబోతోన్న ప్రాజెక్ట్‌ను శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ తన కెరీర్‌లో మొదటి సారిగా ఓ తెలుగు హీరోతో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఆ బడ్జెట్ కూడా పరిధులు దాటినట్టు సమాచారం. ఒక్కో పాటకు దగ్గరదగ్గర పది, పదిహేను కోట్లను శంకర్ ఖర్చు పెడుతున్నాడు.

ఇప్పుడు ఐదు వందల మంది డ్యాన్సర్లతో ఓ పాటను షూట్ చేసేందుకు శంకర్ రెడీ అయ్యాడట. అయితే దిల్ రాజుకి, శంకర్‌కి బడ్జెట్ విషయంలో చిన్న పాటి గొడవలు కూడా అయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా కూడా శంకర్ మాత్రం తన మార్క్ మిస్ అవ్వకుండా పాటలను షూట్ చేస్తున్నాడట.

ఈ సినిమాలో రామ్ చరణ్‌ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. కాలేజ్ కుర్రాడిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల అధికారిగా ఇలా మూడు డిఫరెంట్ లుక్స్, పాత్రల్లో కనిపించనున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇది వరకే లీక్ అయిన సంగతి తెలిసిందే.

రాజమండ్రి, వైజాగ్, అమృత్ సర్ ఇలా ఎక్కడ షూటింగ్ చేసినా కూడా అక్కడి లుక్స్ బయటకు వచ్చేశాయి. అలా కాలేజ్ పాత్రలో రామ్ చరణ్‌ ఎలా కనిపిస్తాడు.. 90వ దశకంలో రామ్ చరణ్‌ పొలిటీషియన్‌గా కనిపించే లుక్‌కు సంబంధించిన ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే ఇంత వరకు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. ఈ మూవీకి అధికారి అనే టైటిల్ అనుకుంటున్నారని అప్పట్లో టాక్ వినిపించింది.

అయితే రామ్ చరణ్‌ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తారనే గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *