Siya Gautam married: పెళ్లి చేసుకున్న రవితేజ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Siya Guatam Marriage: సినీ పరిశ్రమలో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది, కియారా అద్వానీ తన చిరకాల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఒక ప్రైవేటు ఈవెంట్లో వివాహం చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకున్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన నేనింతే సినిమా ద్వారా బాలీవుడ్ మోడల్ సియా గౌతమ్ తెలుగు తెరకు పరిచయమైంది.

ఇక్కడికి వచ్చాక అదితి గౌతమ్ గా పేరు మార్చుకున్న ఆమె నేనింతే సినిమాతో తన లక్ పరీక్షించుకుంది. సినిమా బాగానే ఉన్నా వసూలు రాక పోవడంతో ఆ సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత సియా గౌతమ్ కి చెప్పుకోదగ్గ ఆఫర్ ఒకటి కూడా లభించ లేదు. తర్వాత చిన్నాచితకా పాత్రలు చేస్తూ కొన్ని కొన్ని సినిమాల్లో మెరుస్తూ ఉండేది, ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు మూవీలో అని ఒక కీలక రోల్ చేసింది.

ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో కనిపిస్తోంది. అనూహ్యంగా ఆమె వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 6 అంటే నిన్న ఆమె వివాహం చేసుకోగా దానికి సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియాలో వెల్లడించింది, ఫిబ్రవరి 6వ తేదీన బంధుమిత్రుల నడుమ ఆమె వివాహం ఘనంగా జరిగింది. సియా భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా కాగా అతను ముంబై బేస్డ్ బిజినెస్ మాన్ అని తెలుస్తోంది.

అయితే ఇది ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయం మీద క్లారిటీ లేదు. సియా వివాహానికి ఇరు తరపున బంధుమిత్రులు హాజరైనట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమెకు సన్నిహితులుగా ఉన్న కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా హాజరైనట్లు చెబుతున్నారు. ఇక ఆమె వివాహం చేసుకున్న వార్త తెలిసి నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Also Read: Dhanush SIR Movie : ధనుష్‌కి ఉన్న బుద్ది మిగతా తమిళ హీరోలకు లేదా?.. విజయ్, అజిత్‌లు నేర్చుకోవాల్సిందిదే

Also Read: Shraddha Murder Case: బ్లో టార్చ్ తో ముఖం కాల్చేసి, ఎముకలను గ్రైండర్లో వేసి దారుణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *