వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఒకే రోజు వాట్సప్ 5 ఫీచర్స్ (WhatsApp Features) రిలీజ్ చేసింది. ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్, వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూ ఫీచర్స్‌ని పరిచయం చేసింది. మెటా (Meta) ఆధ్వర్యంలోని వాట్సప్ ఈ ఫీచర్స్‌ని యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ 5 వాట్సప్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి. మరి ఈ 5 ఫీచర్స్ ఎలా పనిచేస్తాయి? వాట్సప్ యూజర్లు ఈ ఫీచర్స్‌ని ఎలా వాడుకోవాలి? తెలుసుకోండి.
Private Audience Selector: మీరు షేర్ చేసే స్టేటస్ ప్రతీది మీ కాంటాక్ట్‌లో ఉన్న యూజర్లు అందరికీ కాకపోవచ్చు. అందుకే ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసింది వాట్సప్ . మీరు అప్‌డేట్ చేసే స్టేటస్ ఎవరు చూడాలో మీరే నిర్ణయించే అవకాశం ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన ఆడియన్స్ సెలెక్షన్ తర్వాత స్టేటస్‌కు డిఫాల్ట్‌గా ఉంటుంది.
Electric Bike: రూ.25 ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం… కొత్త ఎలక్ట్రిక్ బైక్ విశేషాలివే
Voice Status: వాట్సప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు, లింక్స్ అప్‌డేట్ చేయొచ్చు. ఇకపై వాట్సప్ స్టేటస్‌లో 30 సెకండ్ల ఆడియో కూడా అప్‌డేట్ చేయొచ్చు. ఏదైనా టైప్ చేయడం కన్నా వాయిస్ రికార్డ్ ద్వారా చెప్పాలనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Status Reactions: వాట్సప్ స్టేటస్‌కి వేగంగా రిప్లై ఇచ్చేందుకు స్టేటస్ రియాక్షన్స్ ఫీచర్ అందిస్తోంది వాట్సప్. ఈ ఫీచర్‌ను వాట్సప్ యూజర్లు చాలా కాలంగా కోరుకుంటున్నారు. స్టేటస్‌కి టెక్స్‌ట్, వాయిస్ మెసేజ్, స్టిక్కర్స్ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు.
Status Profile: స్టేటస్ ప్రొఫైల్ రింగ్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ రింగ్‌లు మీ కాంటాక్ట్‌లో ఉన్న వారి ప్రొఫైల్ పిక్చర్స్ కనిపిస్తాయి. ఛాట్ లిస్ట్స్, గ్రూప్ పార్టిసిపెంట్స్ లిస్ట్స్, కాంటాక్ట్ ఇన్ఫోలో కూడా ఇవి కనిపిస్తాయి.
5G Smartphone: రూ.1,000 ఈఎంఐతో ఈ 5G మొబైల్ మీ సొంతం… 16GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్, మరెన్నో ఫీచర్స్
Link Previews: స్టేటస్‌లో ఎవరైనా లింక్ పోస్ట్ చేస్తే విజువల్ ప్రివ్యూ కనిపిస్తుంది. విజువల్ ప్రివ్యూస్‌తో స్టేటస్ ఇంకా బాగా కనిపిస్తుందని వాట్సప్ చెబుతోంది. ఆ లింక్‌లో ఏం ఉందో మీ కాంటాక్ట్స్‌లోని వారు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
ఈ అప్‍డేట్స్ అన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వాట్సప్ యూజర్లకు రోల్ అవుట్ చేశామని, కొన్ని వారాల్లో ఈ ఫీచర్స్ యూజర్లకు లభిస్తాయని వాట్సప్ చెబుతోంది.