తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల మాట్లాడటం బాధాకారమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మొదటి నుంచి తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకమని ఆరోపించారు. జగన్ జైలు కెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. షర్మిల, విజయలక్ష్మిని రాజకీయంగా జగన్ అన్యాయం చేశారని కామెంట్ చేశారు. షర్మిల ఆంధ్రకు వెళ్లి ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు. రెపో మాపో జగన్ జైలుకు పోతే ఆమెకు అవకాశం వస్తుందని అన్నారు. ఇక్కడ తిరిగి సమయం వృధా చేసుకోవద్దని ఆమెకు సూచించారు.
YS Sharmila: షర్మిలకు కడియం శ్రీహరి సూచన.. జగన్ జైలుకు వెళితే..
