అమెరికాలో తుపాకీ బుల్లెట్ తగిలి తెలంగాణ విద్యార్ది అఖిల్‌ సాయి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలంగాణ(Telangana) విద్యార్ధి ప్రమాదవశాత్తు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం (Khammam)జిల్లాకు చెందిన మహాంకాళి అఖిల్ సాయి (Akhil sai)సోమవారం రాత్రి చేతిలో గన్ మిస్‌ ఫైర్ (Gun misfire)కావడంతో బుల్లెట్ తగిలి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న అఖిల్ సాయి తల్లిదండ్రులు మొదట షాక్‌కు గురయ్యారు. చేతికి అందివచ్చిన బిడ్డ శాశ్వతంగా దూరమయ్యాడనే వార్తను జీర్ణించుకోలేక బోరున విలపిస్తున్నారు.ఈసంఘటనపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR)స్పందించారు. అఖిల్‌ సాయి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసేందుకు భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని తెప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హమీ ఇచ్చారు కేటీఆర్.

Mulugu: ప్రాణం తీసిన అతివేగం.. నలుగురు ఎక్కే ఆటోలో 18 మంది కూలీలు.. ఎవరిదీ తప్పు?

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ మృతి..

అమెరికాలో తెలంగాణ విద్యార్ధి చనిపోయాడు. అలబామా రాష్ట్రంలోని ఆబర్న్‌ సిటీలో ఉంటున్న 25సంవత్సరాల మహాంకాళి అఖిల్ సాయి అనే యువకుడు తుపాకీ బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అఖిల్‌ సాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన యువకుడు. 13నెలల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వచ్చాడు. అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అలబామాలోని మోంట్‌గోమెరీలో గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే సోమవారం రాత్రి డ్యూటీ చేస్తున్న దగ్గర సెక్యురిటీ గార్డ్ చేతిలో తుపాకీ తీసుకొని పరిశీలిస్తుండగా అది మిస్ ఫైర్ అయి బుల్లెట్ అఖిల్ సాయి శరీరంలోకి దూసుకెళ్లింది. వెంటనే గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అఖిల్‌ సాయి చనిపోయాడు.

తల్లిదండ్రుల ఆవేదన..

అమెరికాలోని అధికారులు అఖిల్ సాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో మొదట షాక్‌కు గురయ్యారు. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన బిడ్డ శాశ్వతంగా దూరమయ్యాడనే వార్తను జీర్ణించుకోలేక కన్నీటిపర్యంతమవుతున్నారు. ఎలాగైనా తమ బిడ్డ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు అఖిల్ సాయి కుటుంబ సభ్యులు.

మంత్రి హామీ ..

ఈఘటనపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అఖిల్ సాయి తల్లిదండ్రులకు తన సానుభూతి తెలియజేశారు. అఖిల్ సాయి మృతదేహాన్ని వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వారి బాధను అర్దం చేసుకొని సహాయం చేయాలని ట్విట్టర్‌లో అఖిల్‌ సాయి ఫోటో, తల్లిదండ్రులు ఏడుస్తున్న వీడియోని షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *